
హైదరాబాద్: రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం (ఉప్పల్) మరో భారీ స్కోర్ల మ్యాచ్‌కు సిద్ధమైంది. కాసేపట్లో (2026, ఏప్రిల్ 13న) సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (RR) జట్లు తలపడనున్నాయి. ఈ మెగా క్యాష్ రిచ్ టోర్నీలోనే అత్యంత డేంజరస్ ఓపెనింగ్ జోడీల మధ్య జరుగుతున్న ఈ పోరుపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
అసలైన ఫైట్ వీళ్ళ మధ్యే:
ఈ మ్యాచ్‌లో ప్రధాన ఆకర్షణ ఇరు జట్లలోని ఓపెనర్లే. నలుగురు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు పవర్‌ప్లేలో విధ్వంసం సృష్టించేందుకు రెడీగా ఉన్నారు. రాజస్థాన్ రాయల్స్ జట్టులో వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ ఈ సీజన్‌లో టాప్ రన్ స్కోరర్లుగా దూసుకుపోతున్నారు. ఇక సన్‌రైజర్స్ టీమ్ బ్యాటర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ గత మ్యాచ్‌లోనే ఫామ్‌లోకి రావడం టీమ్ మేనేజ్‌మెంట్‌కు పెద్ద ఊరటనిస్తోంది.
పిచ్ ఎలా ఉండబోతోంది?:
సాధారణంగా ఉప్పల్ పిచ్ బ్యాటర్లకు స్వర్గధామం. ఇక్కడ ఎప్పుడూ భారీ స్కోర్లు నమోదవుతుంటాయి. గత మ్యాచ్‌లో మహమ్మద్ షమీ ఇక్కడ స్వింగ్‌తో ఓపెనర్లను ఇబ్బంది పెట్టాడు. ఈసారి కూడా పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందా లేక బౌలర్లు మ్యాజిక్ చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.
విజేత ఎవరు?:
ప్రస్తుత ఫామ్ ప్రకారం చూస్తే రాజస్థాన్ రాయల్స్ (RR) హాట్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. అయితే, సన్‌రైజర్స్‌కు హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉండటం, టాస్ కలిసొస్తే సీన్ రివర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. పాట్ కమిన్స్ అందుబాటులో లేకపోవడంతో బ్రిడన్ కార్స్ బౌలింగ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. రాజస్థాన్ రాయల్స్ బలంగా కనిపిస్తున్నప్పటికీ, ఉప్పల్ స్టేడియంలో ఆరెంజ్ ఆర్మీని తక్కువ అంచనా వేయలేం.. ఎవరు ఎక్కువ పరుగులు చేస్తారనే విషయంలో వైభవ్ సూర్యవంశీ వైపు మొగ్గు చూపిస్తున్నప్పటికీ, అభిషేక్– -హెడ్ జోడీ రెచ్చిపోతే రికార్డులు బద్దలవ్వడం ఖాయం!
సన్‌రైజర్స్ హైదరాబాద్:
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్/ కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, శివంగ్ కుమార్, హర్షిల్ పటేల్, ఈషాన్ మలింగ.
(ఇంపాక్ట్ ప్లేయర్: లియామ్ లివింగ్‌స్టోన్)
రాజస్థాన్ రాయల్స్:
యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్.
(ఇంపాక్ట్ ప్లేయర్: బ్రిజేష్ శర్మ)