అంబేద్కర్ అణగారిన వర్గాలకు విద్యను, హక్కులను, ఆత్మగౌరవాన్ని అందించిన గొప్ప విజన్ ఉన్న నాయకుడని ప్రొఫెసర్ కంచ ఐలయ్య కొనియాడారు. నేటి యువత ఆయన ఆలోచనలను లోతుగా అధ్యయనం చేసి అనుసరించాలన్నారు. సమాజ మార్పు కోసం అంబేద్కర్ చూపిన బాటలో నడవడమే ఆయనకు మనం ఇచ్చే అసలైన గౌరవమవమన్నారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో నిర్వహించిన ‘సోషల్ ఎంపవర్మెంట్ వీక్’ జరిగింది.ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఐలయ్య మాట్లాడుతూ.. అంబేద్కర్‌ను అర్థం చేసుకోవాలంటే ఆయన రచనలను, ఉద్యమాలను సమగ్రమైన దృక్పథంతో చూడాలన్నారు. బౌద్ధం ద్వారా ఆయన ఈ సమాజానికి ఒక గొప్ప ప్రత్యామ్నాయాన్ని చూపారన్నారు. ఒకవేళ బౌద్ధేతర సిద్ధాంతాలు అంబేద్కర్‌ను స్వీకరించాలనుకుంటే.. అవి తమను తాము సంస్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎందుకంటే ఆయన ఆలోచనలు శ్రమజీవుల, బహుజన వర్గాల నిజ జీవిత అనుభవాల నుండి పుట్టినవని చెప్పారు.
అయితే నేటి రాజకీయ పరిస్థితులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు కంచ ఐలయ్య. జయంతులు జరపడం ద్వారానే అంబేద్కర్‌ను అనుసరిస్తున్నామని అనుకోవడం సరికాదన్నారు. కొంతమంది రాజకీయ శక్తులు అంబేద్కర్‌ను కేవలం రాజ్యాంగ నిర్మాతగా మాత్రమే పరిమితం చేస్తూ, ఆయనలోని సామాజిక విప్లవకారుడిని తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. కేవలం విగ్రహాలు పెట్టడం, జయంతులు జరపడం ద్వారానే అంబేద్కర్‌ను అనుసరిస్తున్నామని అనుకోవడం సరికాదన్నారు.