
వరుస ఓటములతో సతమతమవుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నేడు కీలక మ్యాచ్ ఆడనుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా.. నేడు ఎస్‌ఆర్‌హెచ్.. రాజస్థాన్ రాయల్స్‌తో తలపడుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో టేబుల్ టాప్‌లో ఉన్న రాజస్థాన్ రాయల్స్‌ను కట్టడి చేయడం కోసం ఎస్ఆర్‌హెచ్ తీవ్రంగా శ్రమించక తప్పదు. ముఖ్యంగా ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, యశస్వీ జైస్వాల్‌లు ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. భారీ స్కోర్‌ని నిలువరించాలంటే.. ముందు ఈ ఇద్దరిని స్వల్పస్కోర్‌కే పరిమితం చేయాలి.
దీంతో ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌లో కీలక మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ బౌలింగ్‌లో తేలిపోతుంది. బ్యాటింగ్‌లో ఎంత భారీ స్కోర్ చేసినా.. బౌలర్లు ఆ స్కోర్‌ను కాపాడుకోలేకపోతున్నారు. దీంతో బౌలింగ్‌లో మార్పులు చేసే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇషాన్ మలింగా స్థానంలో బ్రైడన్ కార్సేని.. జయదేవ్ ఉనద్కట్ స్థానంతో శివమ్ మావిని జట్టులోకి తీసుకుంటారని తెలుస్తోంది.
2018లో ఐపిఎల్‌లోకి అడుగు పెట్టిన మావి. 32 మ్యాచులు 30 వికెట్లు శాడు. చివరిగా ఈ యువ పేసర్ 2022లో కెకెఆర్ తరఫున బరిలోకి దిగాడు. ఐపిఎల్ 2026 వేలంలో మావిని రూ.75 లక్షలకు సన్‌రైజర్స్ కొనుగోలు చేసింది. మావి జట్టులోకి తీసుకుంటే.. అతడు పరుగులను కట్టడి చేయడమే కాక.. వికెట్లు తీసే అవకాశం ఉంది.