Reading Time: 2 minutes

Ram Charan: రామ్ చరణ్ స్టైలిష్ లుక్స్ వైరల్.. ఎస్క్వైర్ ఇండియా ప్రశంసల వర్షం

Caption of Image.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త లుక్ ఆకట్టుకుంటోంది. ప్రముఖ మ్యాగజైన్ ఎస్క్వైర్ ఇండియా (Esquire India) కవర్‌పై మెరిసి రికార్డ్ క్రియేట్ చేశారు. ఏప్రిల్ ఎడిషన్‌లో భాగంగా హీరో చరణ్ స్టైలిష్ లుక్‌లో మెరిసి ప్రత్యేక గుర్తింపు పొందారు. దుబాయ్‌లో జరిగిన ఈ స్పెషల్ ఫోటోషూట్ పిక్ సోషల్ మీడియాలో వీపరీతంగా వైరల్ అవుతుంది.

ఈ కవర్‌ పేజీపై చోటు దక్కించుకున్న రెండో తెలుగు నటుడిగా రామ్ చరణ్ నిలవడం విశేషం. అంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ ఈ మ్యాగజైన్ కవర్‌ పేజీపై కనిపించి అభిమానులను మెస్మరైజ్ చేశారు. 

ఈ సందర్భంగా ఎస్క్వైర్ ఇండియా కవర్ పేజీ X వేదికగా ఫోటో షేర్ చేస్తూ చరణ్పై ప్రశంశలు కురిపించింది. ‘‘ప్రస్తుత ప్రపంచ సినీ రంగాన్ని ప్రభావితం చేస్తున్న ప్రముఖ శక్తి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇవాళ భారతీయ సినిమాకు కొత్త నిర్వచనం అందిస్తున్న అరుదైన నటుల్లో ఒకరు. ఎప్పుడూ చూడని కొత్త అవతార్‌లోకి అడుగుపెట్టిన ఈ స్టార్ నటుడి సినీ ప్రయాణాన్ని మా తాజా కవర్ పేజీ ద్వారా గర్వంగా ఆవిష్కరిస్తున్నాము’’ అని ట్వీట్ చేసింది 

చరణ్ గత కవర్ పేజీ లుక్స్:

2026 ప్రారంభంలోనే జనవరి ఎడిషన్‌లో ప్రముఖ ఆటోమొబైల్ మరియు లైఫ్‌స్టైల్ మ్యాగజైన్ కవర్ స్టార్‌గా కూడా రామ్ చరణ్ నిలిచారు. అలాగే GQ ఇండియా మ్యాగజైన్‌లో కూడా ఆయన పలుమార్లు ఫీచర్ అయ్యారు. ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ ఎస్క్వైర్ ఇండియాతో జరిగిన రామ్ చరణ్ పూర్తి ఇంటర్వ్యూ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం చరణ్ ‘పెద్ది’ మూవీతో బిజీగా ఉన్నారు. 

పెద్ది:

బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న‘పెద్ది’ విడుదలకు సిద్దమవుతోంది. ప్రస్తుతం ఓ సాంగ్ షూట్ తో బిజీగా ఉంది. ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీ భారీ అంచనాలతో ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఇటీవలే ‘‘పెహల్వాన్ గ్లింప్స్’’ రిలీజై దుమ్మురేపింది. యూట్యూబ్తో సహా మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో రచ్చ రచ్చ చేసేసింది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.