
చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళా ఖైదీ పరారైన సంఘటన పేట్లబుర్జు మెటర్నిటీ ఆస్పత్రిలో సోమవారం చోటుచేసుకుంది. గంటసాల త్రివేణి(26) చంచల్‌గూడ జైలులో ఖైదీగా ఉంది. త్రివేణి ఆరోగ్యం బాగా లేకపోవడంతో పేట్లబుర్జు మెటర్నిటీ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. సెక్యూరిటీగా ఎఆర్ కానిస్టేబుళ్లు వచ్చారు. సెక్యూరిటీ గార్డుల కళ్లు కప్పి త్రివేణి ఆస్పత్రి నుంచి పరారయ్యారు. పోలీసులు హుస్సేనీ ఆలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.