Reading Time: < 1 minute

సంక్రాంతి నోములు.. శుభాలనిచ్చే నోములు.. బొమ్మలు.. బొట్టెపెట్టెలు.. గురుగుల పూజ

Caption of Image.

దీపావళి నోముల గురించి అందరికీ తెలుసు. కానీ కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతికి కూడా నోములు నోచుకుంటారు. కన్నె నోము, పెళ్లి నోము, పొట్ట గరిజెలు, బాలింత కుండలు అంటూ రకరకాలుగా ఉంటాయి. ఈ నోములు అనేవి పుట్టింటి వాళ్లు పట్టిస్తారు. కొన్ని చోట్ల అత్తింటివాళ్లకు ఉన్నా నోచుకుంటారు. ఈ నోమును మకర సంక్రాంతి రోజు నోచుకుంటారు. 

కన్నె నోములో.… చిన్న పిల్లల చేత పదమూడు బొమ్మలు, అద్దం,బొట్టు దగ్గరి నుంచి పెన్సిళ్ల వరకు చాలావాటితో నోము చేయొచ్చు. పూజ అయ్యాక వాటిని పదమూడు మంది ముత్తైదువులకు ఇచ్చి పంపుతారు. 

ALSO READ : కనుమ పండుగ..వ్యవసాయ పండుగ.. ఆ రోజు ఎవరిని పూజించాలి.. ఏమేమి తినాలి..

 పెళ్లి నోములో.... మంచం మీద బియ్యం పోసి, దంపతులతో పదమూడు గురుగులకు పూజ చేయిస్తారు.

 పొట్ట గరిజెలు అంటే… గర్భిణుల చేత చేయించే నోము, ప్రసవం హాయిగా జరగాలని, తల్లీబిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉండాలని గౌరమ్మను కోరుకుంటారు. 13 జతల గరిజెలతో పూజ చేసి వాయినం ఇస్తారు.  ప్రసనం తర్వాత బాలింత కడవలు అనే నోము చేయిస్తారు. ఐదు కుండలు (లేదా బిందెలు) గౌరమ్మ ముందు పెట్టి పూజ చేస్తారు.

©️ VIL Media Pvt Ltd.