Reading Time: < 1 minute

మనం దేవుడి పూజకు వాడే నీలిరంగు శంఖం పువ్వులు (Butterfly Pea) అందరికీ తెలుసు. ఇటీవల ‘బ్లూ టీ’ అంటూ ఈ పువ్వుల టీ బాగా ఫేమస్ అయ్యింది. అయితే, ఈ తీగకు కాసే చిన్న చిక్కుడు కాయల వంటి కాయల గురించి చాలామందికి తెలియదు. ఇవి కేవలం విత్తనాల కోసం మాత్రమే అనుకుంటే పొరపాటే. ఆయుర్వేదంలో ఈ చెట్టు ఆకు, పువ్వు, వేరుతో పాటు ఈ కాయలకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. వీటిని ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం.

శంఖం కాయలు తినవచ్చా?: అవును, శంఖం చెట్టుకు కాసే లేత కాయలను తినవచ్చు. ఇవి చూడటానికి చిన్న చిక్కుడు కాయల్లా ఉంటాయి. వీటిని ఆసియా దేశాల్లోని చాలా ప్రాంతాల్లో కూరల్లో, సలాడ్లలో వాడుతుంటారు. అయితే ముదిరిన కాయలు గట్టిగా, పీచుగా ఉంటాయి కాబట్టి, కేవలం లేతగా ఉన్నప్పుడు మాత్రమే వీటిని వంటల్లో వాడుకోవడం మంచిది. వీటి రుచి దాదాపుగా బఠానీలు లేదా చిక్కుడు కాయల రుచినే పోలి ఉంటుంది.

Beyond the Bloom: Are Shankh Flower Pods Edible and Beneficial?
Beyond the Bloom: Are Shankh Flower Pods Edible and Beneficial?

ఇందులో దాగిన ఆరోగ్య రహస్యాలు:మెదడు చురుకుదనం ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే మతిమరుపును తగ్గించి, జ్ఞాపకశక్తిని పెంచడంలో ఇవి సహాయపడతాయి. ఇక జీర్ణక్రియ మెరుగుపడుతుంది. వీటిలో ఉండే పీచు పదార్థం మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్, శరీరంలోని మలినాలను తొలగించి, రోగనిరోధక శక్తిని పెంచే శక్తి వీటికి ఉంది. షుగర్ నియంత్రణలో వుండటానికి, రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి ఈ మొక్కలోని అన్ని భాగాలు దోహదపడతాయి.

ఎలా ఉపయోగించాలి?: లేత శంఖం కాయలను చిన్న ముక్కలుగా కోసి, ఇతర కూరగాయలతో కలిపి వండుకోవచ్చు. లేదా వీటిని ఉడికించి కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి చల్లుకుని చిరుతిండిలా కూడా తీసుకోవచ్చు. అయితే, వీటిని మితంగా తీసుకోవడం ముఖ్యం.

The post శంఖం పువ్వులే కాదు… వాటి కాయలూ ఔషధమా? తినవచ్చా తెలుసా? appeared first on Manalokam – Latest Telugu News & Updates.