Reading Time: < 1 minute

రణ్‌వీర్ సింగ్ హీరోగా అదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ధురంధర్: ది రివేంజ్’. విడుదలైన రోజు నుంచి ఈ సినిమా ప్రశంసలు అందుకుంటోంది. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ‘ధురంధర్’కి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. కాగా ఎన్నో ఏళ్లుగా నార్త్ అమెరికాలో బాహుబలి పేరుతో ఉణ్న రికార్డును తాజాగా ఈ సినిమా బ్రేక్ చేసింది. నార్త్ అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఇది నిలిచింది.

దీనిపై బాహుబలిలో భళ్లాలదేవగా విలనిజం పండించిన రానా స్పందించారు. ధురంధర్ సినిమా సాధిస్తున్న రికార్డులు చూసి ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ‘‘ఎన్నో దశాబ్దాలుగా బాహుబలి పేరిట ఉన్న రికార్డను ధురంధర్2 సొంతం చేసుకుంది. బాహుబలి, ధురంధర్ లాంటి సినిమాలు మరిన్ని రావాలి. ఎన్నో రికార్డులు సొంతం చేసుకోవాలి. ఎన్ని వచ్చినా దేని ప్రత్యేకత దానిదే’’ అని రానా అన్నారు. స్థానిక కథల గురించి ఆయన ప్రస్తావించారు. తమ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే సినిమాలు తీయడంలో కొరియా వాళ్లు ముందుంటారు అని రానా తెలిపారు.