Reading Time: < 1 minute

మరో విజయంపై సన్‌‌‌‌‌‌‌‌రైజర్స్ గురి.. ఢిల్లీ చేతిలో చిత్తుగా ఓడిన లక్నోతో ఉప్పల్లో మ్యాచ్

Caption of Image.

హైదరాబాద్, వెలుగు: ఐపీఎల్ 19వ సీజన్‌‌‌‌‌‌‌‌లో సొంతగడ్డపై తొలి పోరుకు సన్‌‌‌‌‌‌‌‌రైజర్స్ హైదరాబాద్ రెడీ అయింది. ఆదివారం మధ్యాహ్నం ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో లక్నో సూపర్ జెయింట్స్‌‌‌‌‌‌‌‌తో తలపడనుంది ఫస్ట్ మ్యాచ్‌‌లో ఆర్సీబీ చేతిలో ఓడినా.. కేకేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై గ్రాండ్ విక్టరీతో బోణీ చేసిన హైదరాబాద్ అదే జోరుతో లక్నో పని పట్టాలని చూస్తోంది.

కెప్టెన్ ఇషాన్ కిషన్‌‌‌‌‌‌‌‌, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెస్‌‌‌‌‌‌‌‌, నితీష్ రెడ్డి ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఉండగా.. రైజర్స్‌‌‌‌‌‌‌‌ ఫేవరెట్‌‌‌‌‌‌‌‌గా బరిలోకి దిగుతోంది. మరోవైపు ఢిల్లీ చేతిలో చిత్తుగా ఓడిన లక్నో జట్టు డీలపడింది. దాంతో అచ్చొచ్చిన ఉప్పల్ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో తమ ఆధిపత్యాన్ని చాటుకుని పాయింట్ల పట్టికలో మరింత ముందుకు వెళ్లాలని హైదరాబాద్ భావిస్తోంది.

ఆస్ట్రేలియా వెళ్లిపోయిన కమిన్స్‌‌‌‌‌‌‌‌
వెన్ను గాయంతో ఇబ్బందిపడుతున్న సన్‌‌‌‌‌‌‌‌రైజర్స్ సన్‌‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్  తదుపరి వైద్య పరీక్షల కోసం స్వదేశం ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. గత జులై నుంచి  గతేడాది కాలంగా కమిన్స్ ఆటకు దూరంగా ఉన్నాడు. ఐపీఎల్ సెకండ్ ఫేజ్‌‌‌‌‌‌‌‌లోనే తను బరిలోకి దిగుతాడని క్రికెట్ ఆస్ట్రేలియా ఇప్పటికే స్పష్టం చేయగా.. రైజర్స్‌‌‌‌‌‌‌‌ను ప్రస్తుతం ఇషాన్ కిషన్‌‌‌‌‌‌‌‌ నడిపిస్తున్నాడు. కమిన్స్ ఈ నెల 17వ తేదీ నాటికి తిరిగి  జట్టులో చేరే చాన్సుంది.

©️ VIL Media Pvt Ltd.