Reading Time: < 1 minute

హైదరాబాద్: విభిన్నమైన విలక్షణమైన సినిమాలు చేయడంలో నటుడు అడివి శేష్ ఎప్పుడు ముందుంటాడు. ఆయన సినిమాలు అంటేనే.. ప్రేక్షకులకు మంచి వినోదం లభిస్తుంది. అడివి శేష్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘డెకాయిట్’. రొమాంటిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి షానీల్ డియో దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఇంటెన్స్, బోల్డ్‌గా ఉంది. అడివిశేష్, మృణాల్ నటన ఆకట్టుకునేలా ఉంది. హరి, జూలియట్ పాత్రల్లో వారిద్దరూ ఒదిగిపోయారు. ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.