Reading Time: < 1 minute

న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతం దాద్రా అండ్ నగర్ హవేలీలో భారీ పేలుడు సంభవించింది. శనివారం ఉదయం సిల్వాసాలోని డెమ్ని స్కూల్ ఫాలియా ప్రాంతంలో ఉన్న ఓ నైట్రోజన్ గోదాంలో జరిగినపేలుడులో కనీసం ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక బృందాలు, అత్యవసర సేవల సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ముందుజాగ్రత్తగా ఆ ప్రాంతాన్ని మూసివేశారు. గాయపడిని వారిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.

ఉదయం ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించడంతో తీవ్ర భయాందోళనలు, గందరగోళం నెలకొన్నాయని స్థానికులు తెలిపారు.ఈ గోదాం రద్దీగా ఉండే రహదారికి సమీపంలో, ఒక పాఠశాలకు కేవలం 30 మీటర్ల దూరంలో ఉండటంతో  భద్రతా ప్రమాణాలపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ గోదాం సరైన అనుమతులతో పనిచేస్తోందా లేదా అనే విషయంపై విచారణ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.