Reading Time: < 1 minute
Cm Revanth Reddy Basara Saraswati Temple Development Foundation

CM Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 6న బాసర సరస్వతి ఆలయం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సుమారు రూ.225 కోట్ల వ్యయంతో ఆలయ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. బాసర ఆలయ అభివృద్ధికి సంబంధించి సమగ్ర మాస్టర్ ప్లాన్ ఇప్పటికే సిద్ధం కాగా, ఆలయాన్ని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాలమైన రహదారులు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఆలయ పరిసరాల్లో పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ఈవీ వాహనాలనే అనుమతించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలని స్పష్టం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఆలయ పరిసరాల్లో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు జరగకుండా నియంత్రణలు ఉండాలని సీఎం పేర్కొన్నారు. భక్తులకు సౌకర్యాలు కల్పిస్తూ, ఆలయాన్ని అభివృద్ధి చేసే దిశగా అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

READ MORE: Harish Rao: గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి.. మాజీ మంత్రి హరీష్‌రావు మాస్ రియాక్షన్..