Reading Time: < 1 minute
Baramati By Election Sunetra Pawar Congress Candidate Akash More Mva Rift

Baramati By-Election: మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్న అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించారు. అయితే, ఆయన మరణంతో బారామతి అసెంబ్లీ నియోజకవర్గానికి బై ఎలక్షన్స్ అనివార్యమయ్యాయి. ఈ స్థానం నుంచి అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ పోటీలో నిలబడ్డారు. అయితే, ముందుగా ఈ స్థానంలో ఏకంగ్రీవంగా సునేత్ర ఎన్నికవుతారని అనుకున్నప్పటికీ, కాంగ్రెస్ రంగంలోకి దిగడంతో ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Read Also: Washington Sundar : పాపం బాస్.. 10 ఏళ్ల ఐపీఎల్ కెరీర్.. ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేని స్టార్ క్రికెటర్!

ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సునేత్ర పవార్‌పై కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని బరిలోకి దింపింది. ఆదివారం సాయంత్రం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే న్యాయవాది ఆకాష్ విశ్వనాథ్ మోర్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. రేపు సునేత్ర పవార్ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఈ ఎన్నికను ఏకగ్రీవం చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. సునేత్ర పవార్ విపక్షాలను కూడా సంప్రదించారు. ఆమె మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ హర్షవర్ధన్ సప్కల్‌ను కూడా కలిశారు. అయితే, అభ్యర్థిని పోటీలో దింపాలనే నిర్ణయం కేంద్ర నాయకత్వం నుంచి వచ్చిందని ఆయన తెలియజేసినట్లు సమాచారం.

మరోవైపు, ఆమె ఉద్ధవ్ ఠాక్రేను కూడా సంప్రదించారు. అయితే, ఇప్పటికీ శివసేన యూబీటీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ అన్నారు. ఆమె బీజేపీతో పొత్తులో ఉన్న విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నట్లు చెప్పారు. బారామతి పవార్ కుటుంబానికి కంచుకోట. అజిత్ పవార్ మరణంతో సునేత్ర పవార్‌కు సింపతీ వర్క్ అవుట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.