Reading Time: < 1 minute

బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా చిన్నైస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై జట్టు ఆర్‌సిబిని బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్‌కి వచ్చిన ఆర్‌సిబి జట్టు నిలకడగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. అయితే మ్యాట్ హెన్రీ వేసిన నాలుగో ఓవర్‌లో విరాట్ కోహ్లీ 16 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత అన్షుల్ కాంబోజ్ ఓవర్‌లో కోహ్లీ (28) శివమ్ దూబేకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం పవర్‌ప్లే (ఆరు ఓవర్లు) ముగిసేసరికి ఆర్‌సిబి ఒక వికెట్ నష్టానికి 51 పరుగులు చేసింది. క్రీజ్‌లో సాల్ట్(20), పడిక్కల్ (3) ఉన్నారు.