
అమెరికాలో పెరిగి సింగర్‌గానే కాక వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్స్, పలు ప్రైవేట్ ఆల్బమ్‌లతో ఆకట్టుకున్న కార్తిక్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రాయవలస’. అమెరికా నుంచి వచ్చిన ఎన్‌ఆర్‌ఐ మహిళా దర్శకురాలు రాధిక జయంతి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. విలేజ్ లైఫ్, అక్కడి మనుషుల ఎమోషన్స్‌ను చూపించేలా సినిమాను తెరకెక్కిస్తున్నారు. శనివారం కార్తిక్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.
రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రం, ఒక రైస్ మిల్ యజమాని రాజు జీవితం చుట్టూ తిరుగుతుందని, ఒకే షెడ్యూల్‌లో షూటింగ్ పూర్తి చేశామని మేకర్స్ తెలియజేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోందని త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు. శ్రీషా నూలు హీరోయిన్‌గా నటిస్తుండగా, అన్నపూర్ణమ్మ, అనిత చౌదరి, జయప్రకాశ్, రవి వర్మ, కాశీ విశ్వనాథ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.