
ఎప్పటిలాగే ఈ వీకెండ్ లో కూడా పలు కొత్త సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. అలాగే ఆసక్తికర వెబ్ సిరీస్ లు కూడా డిజిటల్ స్ట్రీమింగ్ లో సందడి చేస్తున్నాయి. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడం, మలయాళం తదితర భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు కూడా వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇందులో ఒక హారర్ థ్రిల్లర్ సినిమా కూడా ఉంది. వెన్నులో వణుకు పుట్టించే సీన్లు, ఒళ్లు గగుర్పొడిచే శబ్ధాలతో ఆద్యంతం ఎంగేజింగ్ గా సాగే ఈ సినిమా శనివారం (ఏప్రిల్ 04) నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. గత నెలలోనే ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. హారర్, సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలు పుష్కలంగా ఉండడంతో ఈ సినిమ ఆడియెన్స్ కు తెగ నచ్చేసింది.. అలాగే బాగా భయపెట్టింది కూడా. ఈ సినిమా కథ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.
మేసీ, చేజ్ బాగా క్లోజ్ ఫ్రెండ్స్. ఓ రోజు అడవికి ట్రెక్కింగ్ కు వెళ్తారు. అక్కడ మేసీకి ప్రపోజ్ చేయాలని అనుకుంటాడు చేజ్ . అయితే ట్రెక్కింగ్ చేస్తూ వాళ్లు విడిపోతారు. అప్పుడే ఓ బొమ్మ ముసుగు వేసుకున్న ఓ వింత మహిళ డాలీ.. తల లేని శవాన్ని పూడ్చి పెట్టడం చేజ్ చూస్తాడు. దీంతో డాలీ ఛేజ్ ను చంపాలనుకుంటుంది. అతనిపై దాడి చేస్తుంది. ఆ తర్వాత మేసీని కూడా తన ఇంట్లో బంధిస్తుంది డాలీ. బాగా చిత్రహింసలు పెడుతుంది. మేసీ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్లాన్ చేస్తుంది. కానీ డాలీ మరింత రెచ్చిపోతుంది? మరి మేసీ అక్కడి నుంచి తప్పించుకుందా? అసలు డాలీ ఎవరు? చేజ్ బతికే ఉన్నాడా?చివరకు ఏమైంది? అన్న ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఒళ్లు గగుర్పొడిచే సీన్లతో ఆద్యంతం ఎంగేజింగ్ గా సాగే ఈ సినిమా పేరు డాలీ. ఇదొక హాలీవుడ్ సినిమా. దర్శకుడు రాడ్ బాక్ల్ హర్ట్ తెరకెక్కించిన ఈ సినిమాలో ఫాబియానె థెరీసా, రస్ టిలర్, కేట్ కాబ్, ఈవ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పుడీ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా కేవలం రెంటల్ బేసిస్ విధానంలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. అంటే అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్ స్క్రిప్షన్ ఉన్నప్పటికీ ఈ సినిమా చూడాలంటే డబ్బులు కట్టాల్సిందే.
అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్.,
#Dolly (English)
Now available for Rent on PrimeVideo in English, Tamil, Telugu & Hindi
!!#OTT_Trackers pic.twitter.com/yT4VNiMZ7x
— OTT Trackers (@OTT_Trackers) April 4, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
!!