Reading Time: 2 minutes

IPL 2026: రఫ్పాడించిన సూర్య, రోహిత్, నమన్.. ఢిల్లీ టార్గెట్ఎంతంటే?

Caption of Image.

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతన్న హైవోల్టెజ్ పోరులో ముంబై ఇండియన్స్ నిర్ణీయ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు మాత్రమే చేసింది. టాన్ ఓడిపోయి బ్యాటింగ్ దిగిన ముంబైకి ఆశించిన స్థాయిలో ఆరంభం లభించలేదు. ఢిల్లీ పాస్ట్ బౌలర్ ముకేష్ కుమార్ బిగ్ షాక్ ఇచ్చాడు, ఒకే ఓవర్లో ఇద్దరు ఎంఐ బ్యాటర్లని ఔట్ చేసి డీసీకి శుభారంభం అందించారు. కాగా ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ మొదటి ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టి మంచి ఊపుమీదున్న అతడ్ని ముకేష్ బౌలింగ్(2.3 ఓవర్)లో రికెల్టన్(9)ని ఔట్ చేయగా, ఆ తర్వాత కాసేపటికే తిలక్ వర్మ(0)ని పెవిలియన్ కి పంపించడంతో కేవలం 18 రన్స్ కే ముంబై కీలకమైన రెండు వికెట్లను కోల్పోయింది.  

అనంతరం క్రీజులోకి వచ్చన సూర్యకుమార్ యాదవ్– రోహిత్ శర్మ కలిసి మూడో వికెట్ కి 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని ఢిల్లీ క్యాపిటల్స్ సారథి అక్షర్ పటేల్ విడదీశాడు. రోహిత్( 26 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్సుతో39 పరుగులు)ని ఔట్ చేశాడు. దీంతో 71 పరుగులకే 3 వికెట్లు కోల్పోగా.. అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన విధ్వంసకర బ్యాటర్ షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (5) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. విప్రాజ్ నిగమ్ బౌలింగ్ లో ముకేష్ కుమార్ కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.

►ALSO READ | IPL 2026: దూకుడు పెంచిన రోహిత్, సూర్యకుమార్.. 10 ఓవర్లకి ముంబై స్కోర్ ఎంతంటే!

ఇక ముంబై ఇండియన్స్ జట్టు బ్యాటింగ్ భుజాలపై వేసుకున్న సూర్యకుమార్ యాదవ్ మాత్రం ( 36 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్సుతో 51 పరుగులు) అర్థ శతకం చేసిన తర్వాత లుంగి ఎండిగి బౌలింగ్ లో LBW ఔట్ అయ్యాడు. దీంతో చివర్లో నమన్ ధీర్, మిచెల్ శాంట్నర్ (18) ఆచితూచి బ్యాటింగ్ చేస్తూ, జట్టు స్కోర్ బోర్డుని ముందుకు నడిపిస్తున్న క్రమంలో నమన్ ధీర్ (21 బంతుల్లో 2 ఫోర్లు ఒక సిక్సుతో 28 పరుగులు) భారీ షాట్ ఆడే క్రమంలో నటరాజన్ బౌలింగ్ లో బౌండరీ లైన్ దగ్గర స్టబ్స్ కి క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. చివరి ఓవర్లో కార్బిన్ బాష్ వరుసగా రెండు ఫోర్లు కొట్టడంతో 20 ఓవర్లలో ముంబై 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఇక ఢిల్లీ బౌలర్లలో ముకేష్ కుమార్ కీలకమైన రెండు వికెట్లు తీసుకోగా.. విప్రాజ్, అక్షర్ పటేల్, లుండి ఎంగిడి, నటరాజన్ తలో వికెట్ పడగొట్టారు.  
 

©️ VIL Media Pvt Ltd.