Reading Time: < 1 minute

అహ్మదాబాద్: ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, యశ్వీ జైస్వాల్ అరుదైన రికార్డు నెలకొల్పారు. శనివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న పోరులో వీరిద్దరు రాజస్తాన్ కు శుభారంభాన్ని అందించారు. పవర్‌ప్లేలో సూర్యవంశీ, వైభవ్ తొలి ఆరు ఓవర్లలో 69 పరుగులు సాధించారు. ఈ క్రమంలో అత్యంత వేగంగా 500 భాగస్వామ్య పరుగులు (బంతుల వారీగా) సాధించిన భారత జోడీగా వైభవ్ సూర్యవంశీ, యశ్వీ జైస్వాల్ కొత్త రికార్డు సృష్టించారు. ఈ జోడీ కేవలం 248 బంతుల్లోనే ఈ ఘనతను సాధించి, గతంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్) తరఫున వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ నెలకొల్పిన 309 బంతుల రికార్డును బ్రేక్ చేసింది.

ఈ జాబితాలో సూర్యవంశీ, జైస్వాల్ మూడో స్థానంలో ఉన్నారు. అత్యంత వేగంగా 500 భాగస్వామ్య పరుగులు సాధించిన రికార్డు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మల పేరిట ఉండగా, 2024 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఓపెనర్లుగా ఆడిన ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్‌లు రెండో స్థానంలో ఉన్నారు.