Reading Time: < 1 minute

అమరావతి: సమాజంలో విలువలు పడిపోయాయని ఎపి మంత్రి లోకేష్ తెలిపారు. విలువలు పెంచాలనే కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. కర్ణాటకలోని సింధనూరులో లోకేష్ పర్యటించారు. హోసళ్లి క్యాంప్ వరకు ర్యాలీ నిర్వహించగా.. లోకేష్ కు ఘనస్వాగతం పలికారు. అందుకే చాగంటి కోటేశ్వరరావు కేబినెట్ ర్యాంక్ ఇచ్చామని, పిల్లలకు విలువలపై అవగాహన కల్పిస్తున్నామని తెలియజేశారు. తెలుగుభాషలో మహిళలను అవమానించేలా కొన్ని పదాలు ఉన్నాయని, ఏ పని చేసినా తల్లికి చెప్పాలని..తల్లికి చెప్పలేని పని చేయవద్దని సూచించారు. ఏ తప్పు చేయని ఎపి సిఎం చంద్రబాబు నాయుడును ఆనాడు అరెస్ట్ చేసి..53 రోజులు జైల్లో పెట్టారని, సింధనూరు, రాయ్ చూర్, గంగావతి ప్రజలు ఆ సమయంలో అండగా నిలబడ్డారని తెలియజేశారు. సింధనూరులో శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూలు నెంబర్ వన్ కావాలని లోకేష్ ఆకాంక్షించారు.