Reading Time: < 1 minute

ఏప్రిల్ 6 నుంచి 11 వరకు హెల్త్ వీక్.. రోజుకో థీమ్తో నిర్వహణ.. కల్తీని అడ్డుకోవడమే లక్ష్యం..

Caption of Image.
  • నిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లినాక్ సేవలు.. 
  • కొత్తగా క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగం గా ఈ నెల 6 నుంచి 11 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య వారోత్సవాలు(హెల్త్ వీక్) నిర్వహించనున్నారు. శని వారం సెక్రటేరియట్ నుంచి ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ.. వారోత్సవాల షెడ్యూల్‌‌‌‌ను ఖరారు చేశారు.  ప్రభుత్వ వైద్య సేవలను ప్రతి గడపకూ చేర్చడమే లక్ష్యంగా, రోజుకో ప్రత్యేక థీమ్‌‌‌‌తో కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. 

ముఖ్యంగా యువత, విద్యార్థులు, మహిళలను ఈ వారోత్సవాల్లో భాగస్వాములను చేయాలని సూచిం చారు. వైద్యారోగ్య రంగంలో రాష్ట్రం సాధిస్తున్న ప్రగతిని ప్రజలకు వివరిస్తూ వారోత్సవాలను విజయ వంతం చేయాలని మంత్రి కోరారు. సమీక్షలో ప్రిన్సి పల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, కమిషనర్ సంగీత సత్యనారాయణ, డీపీహెచ్ రవీంద్ర నాయక్ పాల్గొన్నారు.

  • వారమంతా… రోజుకో థీమ్

తొలిరోజు 6న ఫుడ్ సేఫ్టీపై ఫోకస్ పెట్టనున్నారు. ఉదయం నెక్లెస్ రోడ్డులో ఈట్ రైట్ వాక్, మధ్యాహ్నం నేచురోపతి హాస్పిటల్‌‌‌‌లో మిల్లెట్ మేళా నిర్వహిస్తారు. 7న వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ఉదయం నిమ్స్ హాస్పిటల్‌‌‌‌లో క్యాన్సర్ బాధితుల కోసం లినాక్‌‌‌‌ మెషీన్‌‌‌‌ను మంత్రి దామోదర ప్రారంభిస్తారు. అనంతరం రవీంద్రభారతిలో 871 మంది కొత్త డాక్టర్లకు నియామక పత్రాలు అందజేస్తారు. ఇదే వేదికపై క్యాన్సర్ రిజిస్ట్రీ, ట్రామా కేర్ పాలసీ, సరోగసీ పోర్టల్స్‌‌‌‌ను ఆవిష్కరిస్తారు. 8న మాతాశిశు మరణాల నివారణపై అవగాహన సదస్సులు నిర్వహిస్తారు. 

గర్భిణులకు ఏఎన్సీ పరీక్షలు, హైరిస్క్ కేసుల గుర్తింపుపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తారు. 9న ఎయిడ్స్ నివారణే లక్ష్యంగా హైదరాబాద్‌‌‌‌లో ‘రెడ్ రన్’ నిర్వహిస్తారు. జైళ్లలో మెడికల్ క్యాంపులు, ట్రాన్స్‌‌‌‌జెండర్ క్లినిక్స్‌‌‌‌లో ఉచిత పరీక్షలు ఏర్పాటు చేస్తారు. 10న రాష్ట్రవ్యాప్తంగా యోగా ప్రదర్శనలు, హోమియోపతి ప్రాధాన్యతపై సెమినార్లు ఉంటాయి. 11న ఔషధాల వినియోగంపై అవగాహన కల్పిస్తూ గాంధీ ఆస్పత్రిలో డీ-అడిక్షన్ ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ క్యాంపును నిర్వహిస్తారు.

©️ VIL Media Pvt Ltd.