Reading Time: < 1 minute

హైదరాబాద్ లో మరో డ్రగ్స్ పార్టీ.. ఆరుగురికి పాజిటివ్..

Caption of Image.

హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. పక్కా సమాచారంతో ఏప్రిల్ 4న  రాత్రి గోల్కొండ  తారామతి బరదారిలో జరుగుతున్న ఒక భారీ పార్టీపై ఈగల్ టీం, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ,గోల్కొండ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు.తారామతి బరదారిలో ‘More Than Friends’ పేరుతో ఇంటర్నేషనల్ డీజే పార్టీ నిర్వహిస్తుండగా.. పోలీసులు సంయుక్తంగా సోదాలు చేపట్టారు. ఈ క్రమంలో పార్టీలో ఉన్న 35 మందిపై అనుమానం రావడంతో, డ్రగ్ డిటెక్షన్ కిట్లతో వారికి అక్కడికక్కడే టెస్టులు నిర్వహించారు.

ఈ పరీక్షల్లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. మొత్తం ఆరుగురికి డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్ అని తేలింది. వీరిలో ఐదుగురు గంజాయి సేవించగా, మరొకరు అంఫెటమిన్ తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. పట్టుబడిన వారిలో ఒక మోడల్, డీజే ప్లేయర్ తో పాటు వ్యాపారవేత్తలు ఉండటం సంచలనం కలిగిస్తోంది. తాము డ్రగ్స్ తీసుకున్నట్లు నిందితులు స్వయంగా అంగీకరించారు.  పట్టుబడిన ఆరుగురిపై NDPS చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ డ్రగ్స్ నెట్‌వర్క్ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు? ఈ మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నాయి? అనే కోణంలో ఈగల్ టీం దర్యాప్తును ముమ్మరం చేసింది.

►ALSO READ | మాదాపూర్ లో అరాచకం.. మద్యం మత్తులో యువతీయువకుల వీరంగం.. ఆర్టీసీ బస్సును అడ్డగించి రాళ్ల దాడి

వీళ్లకు పాజిటివ్

  •     సర్వర్ (మోడల్, నటుడు)
  •     నిహార్ (సుగంధ ద్రవ్యాల వ్యాపారి)
  •     మరో వ్యక్తి నిహార్
  •     జాసన్ (డీజే ప్లేయర్)
  •     యోగేశ్వర్ (వ్యాపారవేత్త)
  •     అబినాష్ (ఫార్మాస్యూటికల్ అనలిస్ట్) 

 

©️ VIL Media Pvt Ltd.