
యాదాద్రి జిల్లాలోని మోత్కూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. పాటిమట్ల గ్రామానికి చెందిన దొండ కొమురయ్య కరెంట్ షాక్ తో రైతు మృతి చెందాడు. ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లాడు. తన వ్యవసాయ బావి వద్ద ఉన్న మోటర్ ను ఆన్ చేస్తుండగా.. కరెంట్ షాక్ కొట్టింది. దీంతో కొముర్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సంఘటనాస్థలానికి చేరుకుని చూడగా.. అప్పటికే కొమురయ్య చనిపోయాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.