
Iran vs USA War: పశ్చిమాసియాలో పరిస్థితులు రోజు రోజుకూ తీవ్ర రూపం దాలుస్తున్నాయి. అమెరికా యుద్ధ విమానాలను ఇరాన్ టార్గెట్ చేసుకుంటోంది. ఇందులో భాగంగా శుక్రవారం అమెరికా వైమానిక దళానికి చెందిన ఎఫ్-15ఈ స్టైక్ ఈగిల్ యుద్ధ విమానాన్ని ఆకాశంలోనే ఇరాన్ కూల్చేసింది. ఈ విమానంలోని పైలట్ ఆచూకీపై 36 గంటల మేర అనిశ్చితి నెలకొంది. తాజాగా గల్లంతైన పైలట్‌ను అమెరికా ఎట్టకేలకు గుర్తించింది. ఎఫ్-15ఈ (F-15E) ఈగిల్ యుద్ధ విమానానికి చెందిన వెపన్ సిస్టమ్స్ ఆఫీసర్‌ను అమెరికా స్పెషల్ ఫోర్సెస్ క్షేమంగా రక్షించాయి. ఈ రెస్క్యూ ఆపరేషన్ హాలీవుడ్ సినిమాను తలపించింది. పైలట్‌ను చేరుకోవడానికి అమెరికా ప్రత్యేక దళాల రెస్క్యూ బృందాలు ఇరాన్ గడ్డపై “భారీ కాల్పులను” ఎదుర్కొన్నాయి. ప్రాణాలకు తెగించి అమెరికా వైమానిక దళంలో వెపన్స్ సిస్టమ్స్ అధికారిగా పని చేస్తున్న ఆ పైలెట్‌ను తీసుకొచ్చారు.
READ MORE: Pakistan: పెరిగిన పెట్రోల్ ధరలతో జనాగ్రహం.. అర్ధరాత్రి పాకిస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం
వాస్తవానికి.. శుక్రవారం కువైట్ గగనతలం నుంచి వెళ్తున్న అమెరికా యుద్ధ విమానాన్ని ఇరాన్ టార్గెట్ చేసింది. ఎట్టకేలకు దాన్ని నేలమట్టం చేసింది. ఈ విమానం నుంచి ఒక పైలట్ సురక్షితంగా బయటపడినట్లు కనిపించింది. రెండో పైలట్ ఆచూకీ మాత్రం లభించలేదు. అతను ఇరాన్ నైరుతి ప్రాంతంలో పడిపోయి ఉంటాడన్న సమాచారంతో అమెరికా రంగంలోకి దిగింది. అటు అమెరికా సైన్యం, ఇటు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) మధ్య పైలట్ వేట మొదలైంది. ఈ నేపథ్యంలో ఇరాన్ సంచనల ప్రకటన చేసింది. అమెరికా పైలట్‌ను ప్రాణాలతో పట్టుకున్న వారికి ఇరాన్ ప్రభుత్వం దాదాపు 60,000 డాలర్ల (సుమారు రూ. 50 లక్షలు) భారీ బహుమతిని సైతం ప్రకటించింది. దీంతో అందరూ ఇరాన్ ఆ పైలట్‌ను పట్టుకుంటుందని భావించారు. కానీ.. అమెరికా స్పెషల్ ఫోర్సెస్ రంగంలోకి దిగాయి. ఇరాన్ గడ్డపై ఆ దేశ సైన్యాన్ని ఎదుర్కొంటూ పైలట్‌ను రక్షించాయి.
READ MORE: Drug Party Busted: ‘ఈగల్ టీం’ మెరుపు దాడులు.. డ్రగ్స్ పార్టీలో దొరికిన బాలీవుడ్, టాలీవుడ్ నటులు..!