
టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ముందుగా బౌలింగ్ ఎంచుకోగా, బంతిని అందుకున్న షమీ మొదటి ఓవర్ నుండే నిప్పులు చెరిగాడు. ఇన్నింగ్స్ ఆరో బంతికే విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మను సున్నా పరుగులకే అవుట్ చేసి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత తన రెండో ఓవర్ మొదటి బంతికే మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ (7)ను తెలివైన స్లోయర్ డెలివరీతో బోల్తా కొట్టించి పెవిలియన్‌కు పంపాడు. కేవలం 2.1 ఓవర్లలోనే 8 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్ పీకల్లోతు కష్టాల్లో పడేశాడు. షమీ తన 4 ఓవర్ల కోటాను కేవలం 9 పరుగులు ఇచ్చి 2 వికెట్లతో ముగించి, సీజన్‌లోనే అత్యుత్తమ స్పెల్ నమోదు చేశాడు. అలాగే డాట్ బాల్స్ తోనూ ఆకట్టుకున్నాడు.
సోషల్ మీడియాలో ‘షమీ’ నామస్మరణ..
షమీ ప్రదర్శన చూసిన క్రికెట్ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. “మత్ కర్ లాలా” (అలా చేయకు లాలా) అంటూ సరదాగా వ్యాఖ్యానిస్తూనే, అతనిని వెంటనే భారత జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గాలిలో బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ, అవసరమైనప్పుడు వేగాన్ని పెంచుతూ షమీ చేసిన బౌలింగ్ పాత రోజులను గుర్తుచేసింది. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్ తర్వాత షమీ ఫామ్ పై వస్తున్న విమర్శలకు ఈ మ్యాచ్‌తో గట్టి సమాధానం ఇచ్చాడు. ముఖ్యంగా అగార్కర్, గౌతమ్ గంభీర్ లకు దిమ్మతిరిగే షాకిచ్చాడు. అగార్కర్, షమీల మధ్య ఇప్పటికే ఘాటు వ్యాఖ్యలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.
రిటైర్మెంట్ వార్తలపై ఘాటు స్పందన..
GOAT Mohammad Shami
This performances of Shami are Slap to the face of agarkar and Gambhir .. Keep Going Shami vaipic.twitter.com/Gp2tyK2W6G
— Sameer (@SamirGuragain07) April 5, 2026
గత కొంతకాలంగా షమీ రిటైర్మెంట్ గురించి వస్తున్న పుకార్లపై ఆయన స్వయంగా స్పందించారు. “ప్రస్తుతానికి నేను రిటైర్మెంట్ గురించి ఆలోచించడం లేదు. అటువంటి ఆలోచనలు మనిషిని నిరుత్సాహపరుస్తాయి. నాకు క్రికెట్ అంటే బోర్ కొట్టిన రోజున, నేను అలసిపోయానని అనిపించిన రోజే ఆటకు స్వస్తి చెబుతాను. అప్పటివరకు నా ప్రయాణం కొనసాగుతుంది” అని షమీ స్పష్టం చేశాడు. గతేడాది దేశీవాళీ క్రికెట్ లో బెంగాల్ తరపున 67 వికెట్లు పడగొట్టి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పటికీ, సెలెక్టర్లు అతనిని పక్కన పెట్టడంపై చర్చ నడుస్తోంది.
లక్నో జట్టులో కొత్త ఉత్సాహం..
MOHAMMED SHAMI BOWLED 17 DOT BALLS IN HIS 4 OVERS SPELL AGAINST SRH. #LSG #SRH #LSGVSSRH #SHAMI pic.twitter.com/ejzNtlEuUG
— Somesh Jangra (@CelebrityGalax) April 5, 2026
గత సీజన్‌లో కేవలం 6 వికెట్లు మాత్రమే తీసిన షమీ, ఈ ఏడాది లక్నో సూపర్ జెయింట్స్ తరపున సరికొత్త ఉత్సాహంతో కనిపిస్తున్నాడు. లక్నో యజమాని సంజీవ్ గోయెంకా అతనిపై ఉంచిన నమ్మకాన్ని షమీ వంద శాతం నిలబెట్టుకుంటున్నాడు. షమీ, ప్రిన్స్ యాదవ్ వంటి స్వదేశీ పేసర్ల విజృంభణతో లక్నో జట్టు ఈసారి టైటిల్ రేసులో ప్రధాన పోటీదారుగా నిలుస్తోంది. ఉప్పల్ స్టేడియంలో షమీ చేసిన ఈ మ్యాజిక్ రాబోయే మ్యాచ్‌ల్లో ప్రత్యర్థి జట్లకు ఒక హెచ్చరికగా మారింది.
Calling Mohammed Shami ‘old’ is the biggest joke! 4 overs, 9 runs, 2 wickets vs SRH…
Dismissed Travis Head & Abhishek Sharma — pure class!
Selectors Ajit Agarkar & Gautam Gambhir, form matters, not age.
Indian team needs Shami….#SRHvsLSG #Shami #TeamIndia#iplonstar pic.twitter.com/pQwEA0DJhv
— Arif Amin (@arifamin045) April 5, 2026
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

….