Reading Time: < 1 minute

తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి ఐపిఎల్‌లో భాగంగా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో ఆర్‌సిబితో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో నితీశ్ తేలిపోయాడు. అటు బంతితో ఇటు బ్యాట్‌తో రాణించలేకపోయాడు. కానీ, కెకెఆర్ మ్యాచ్‌లో మాత్రం చెలరేగిపోయాడు. దీంతో ఇది టీం ఇండియాకు శుభ పరిణామం అంటూ మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నారు. నితీశ్‌పై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు.

‘‘నితీశ్ వేగంగా బౌలింగ్ చేస్తున్నాడు. బౌలింగ్‌కు మరికొంత పేస్ కూడా జత చేశాడు. అతడి బౌలింగ్ శైలీ, లయ మెరుగుపడ్డాయి. పూర్తిగా ఫిట్‌గా ఉన్నందు వల్లే అతడికి ఇది సాధ్యమైంది. తన ఫిజికల్ ట్రెయినర్‌కు అతడు క్రెడిట్ ఇచ్చాడు. అతడు ఫిట్‌గా ఉండటమే అతి పెద్ద సానుకూలాంశం. అతడు బౌన్స్ కూడా రాబట్టగలుగుతున్నాడు. నితీశ్ ఇలా రాణించడం టీం ఇండియాకు శుభవార్తే అవుతుంది’’ అని గవాస్కర్ కొనియాడారు.