Reading Time: < 1 minute

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఘన విజయం సాధించింది. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ఆఖరు వరకూ పోరాడి జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్.. 20 ఓవర్లలో 9 వికెట్ల కోల్పోయి 156 పరుగులు చేసింది. ఈ స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగి లక్నో.. ఆరంభంలో దూకుడుగానే ఆడింది. మార్క్‌రం(45) అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. అయితే మధ్య ఓవర్లలో లక్నో బ్యాటర్లని హైదరాబాద్ బౌలర్లు కట్టడి చేశారు. ఓ వైపు వికెట్లు పడుతున్న పంత్(68) మాత్రం పట్టు వదలకుండా బ్యాటింగ్ చేశాడు. ఆఖరి ఓవర్‌లో 9 పరుగులు అవసరం ఉండగా.. పంత్ తొలి రెండు బంతుల్లో రెండు ఫోర్లు కొట్టాడు. ఆ తర్వాత రెండు డాట్‌బాల్స్ పడ్డాయి. దీంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో 5 బంతిని కూడా ఫోర్‌గా మలిచి.. పంత్ జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో లక్నో ఈ సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది.