Reading Time: < 1 minute
లోకేష్‌ యూనివర్స్.. ఇక లేనట్టేనా?

వెండితెరపై ట్రెండ్‌లు మారడం సర్వసాధారణం. అయితే, ఇటీవల కాలంలో అత్యంత విజయవంతమైన “సినిమాటిక్ యూనివర్స్” ఫార్ములా ఇప్పుడు సడెన్‌గా కనుమరుగవుతున్నట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు టాప్ స్టార్స్‌ను భాగం చేసుకుని విజయాలు సాధించిన ఈ ట్రెండ్ ప్రస్తుతం వెనుకబడిపోయింది. మేకర్స్ యూనివర్స్‌లను పక్కన పెట్టి, స్టాండ్‌లోన్ చిత్రాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ జాబితాలో ముందుగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ పేరు చెప్పుకోవచ్చు. డ్రగ్ మాఫియా నేపథ్యంలో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో కమల్ హాసన్, విజయ్, కార్తీ, సూర్య వంటి స్టార్స్‌ను భాగం చేశారు. అయితే, ఇప్పుడు లోకేష్ ఈ యూనివర్స్‌ను పక్కన పెట్టి స్టాండ్‌లోన్ చిత్రాలు చేస్తున్నారు. బాలీవుడ్‌లో వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ కూడా కష్టాల్లో ఉంది. పఠాన్ విజయం తర్వాత వచ్చిన టైగర్ 3 డిజాస్టర్ కావడంతో, వైఆర్ఎఫ్ టీమ్ ఈ యూనివర్స్‌ను పక్కన పెట్టే ఆలోచనలో ఉంది. ప్రకటించిన టైగర్ వర్సెస్ పఠాన్ సినిమాను కూడా నిలిపివేశారు.

మరిన్ని వీడియోల కోసం :

నో మోర్‌ డౌట్స్‌..కన్ఫార్మ్ చేసిన చెర్రీ

రామాయణ టీజర్‌ అంచనాలను అందుకుందా?

హద్దులు చెరిపేస్తున్న యంగ్ హీరోలు

గాజాలో కంటతడి పెట్టిస్తున్న చిన్నారుల ఆట దృశ్యం