
ధర్మసాగర్/ ఖమ్మం రూరల్, వెలుగు: మక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. శనివారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. అనంతరం ఆయన 13 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్, 43 మంది సీఎంఆర్ఎఫ్లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు మక్కల కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఖమ్మం జిల్లా మద్దులపల్లి మార్కెట్ యార్డులో మార్క్‌ఫెడ్ సౌజన్యంతో ఏదులాపురం పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ్‌బాబు ప్రారంభించారు.