కావాల్సిన పదార్ధాలు : ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, ఒక కప్పు కొబ్బరి పాలు, ఒక కప్పు కప్పు బియ్యం, అర కప్పు సేమియా , ఒక కప్పు తురిమిన బెల్లం, జీడిపప్పులు, 5 బాదం పప్పులు, కిస్ మిస్ లు, యాలకుల పొడి, అర కప్పు నెయ్యి, రెండు టేబుల్ స్పూన్, కొద్దిగా ఉప్పు తీసుకోవాలి.
ముందుగా గ్యాస్ స్టవ్ దాని మీద పాన్ లేదా ఒక పాత్ర తీసుకుని నూనె లేదా నెయ్యి వేసి పచ్చి కొబ్బరిని వేయించుకోవాలి. ఆ తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని మెత్తగా అయ్యేలా మిక్సీ పట్టుకోవాలి. అలాగే, బెల్లం లేదా పంచదారను తీసుకోవాలి .
ఇక ఇప్పుడు మళ్ళీ గ్యాస్ వెలిగించి దానికి మీద ఒక చిన్న తెపాలా పెట్టి మూడు కప్పుల కొబ్బరి పాలు పోసి అవి మరిగిన తర్వాత దానిలో బెల్లం తురుమును వేసి ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి
మరుగుతున్న పాలు, బెల్లం మిశ్రమంలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ ను వేసి మీడియం మంట మీద ఉంచి 10 నిమిషాల పాటు వాటిని పొయ్యి మీదే ఉడికించాలి. ఈ మిశ్రమం పాయసంలా మారే వరకు బాగా వేయించాలి.
కొబ్బరి పాయసాన్ని బాగా ఉడకనివ్వాలి. ఇలా చేస్తే చాలా రుచిగా ఉంటాయి. ఆ తర్వాత వీటిలో మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యి, బాదం పప్పులు, కిస్ మిస్ లు, జీడీపప్పులు వేసి ఒక చిన్న గరిటేతో దీనిని కలపాలి. అంతే, వేడి వేడి పచ్చి కొబ్బరి పాయసం రెడీ.




