
మన వంటింట్లో దొరికే సామాన్యమైన వస్తువులతోనే ఈ బొద్దింకల బెడదను శాశ్వతంగా వదిలించుకోవచ్చని మీకు తెలుసా? ముఖ్యంగా మనం సాధారణంగా పారేసే ఒక పండు తొక్క బొద్దింకల పాలిట యముడిలా పనిచేస్తుంది. అసలు ఆ చిట్కా ఏంటి? బొద్దింకలను తరిమికొట్టే ఇతర సులభమైన మార్గాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
బొద్దింకలను తరిమికొట్టే ‘నారింజ’ మ్యాజిక్:
మనం నారింజ పండ్లు తిన్న తర్వాత తొక్కలను చెత్తలో పారేస్తాము. కానీ, ఈ తొక్కలకు బొద్దింకలను తరిమికొట్టే శక్తి ఉంది. నారింజ తొక్కల నుండి వచ్చే పుల్లని ఘాటైన వాసన బొద్దింకలకు అస్సలు నచ్చదు.
ఎలా వాడాలి?: ముందుగా నారింజ తొక్కలను ఎండబెట్టి పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని బొద్దింకలు తిరిగే మూలల్లో, సింక్ కింద, స్టవ్ వెనుక చల్లితే.. ఆ వాసన పీల్చిన బొద్దింకలు వెంటనే ఆ ప్రదేశం నుండి పారిపోతాయి.
మరికొన్ని ఇంటి చిట్కాలు:
1. బేకింగ్ సోడా – చక్కెర:
బేకింగ్ సోడా మరియు చక్కెరను సమానంగా కలిపి మూలల్లో చల్లండి. చక్కెర తీపికి ఆకర్షితమై బొద్దింకలు దీనిని తింటాయి, కానీ అందులోని బేకింగ్ సోడా వల్ల అవి వెంటనే చనిపోతాయి.
2. పలావు ఆకుల ఘాటు:
మనం వంటల్లో వాడే పలావు ఆకులను (Bay Leaves) అల్మారాల్లో ఉంచడం వల్ల, వాటి నుంచి వచ్చే ఘాటైన వాసన బొద్దింకలను రాకుండా చేస్తుంది.
3. వేప నూనె పవర్:
కొద్దిగా వేప నూనెను నీటిలో కలిపి కిచెన్ అంతా స్ప్రే చేయండి. వేపలో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాలు కీటకాలను దరిచేరనివ్వవు.
చిన్న జాగ్రత్తలు – పెద్ద ఫలితాలు:
సహజ చిట్కాలతో పాటు వంటగదిని పొడిగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. పడుకునే ముందు సింక్‌లో ఎంగిలి గిన్నెలు లేకుండా చూడటం, నీరు లేకుండా తూడవడం, చెత్తను ప్రతిరోజూ బయట పారవేయడం వంటి చిన్న జాగ్రత్తలు తీసుకుంటే బొద్దింకల సమస్య సగానికి పైగా తగ్గిపోతుంది.
ఆరోగ్యకరమైన వంటగది కోసం రసాయనాలకు స్వస్తి చెప్పి, ఇలాంటి సహజ సిద్ధమైన పద్ధతులను పాటించడం ఉత్తమం. రూపాయి ఖర్చు లేకుండా మీ ఇంటిని బొద్దింకల రహితంగా మార్చుకోండి.