Reading Time: < 1 minute

ఆన్-సైట్ ఎఫ్‌‌‌‌ఐఆర్ విధానంపై సీపీ సమీక్ష సమావేశం 

Caption of Image.

కరీంనగర్ క్రైమ్, వెలుగు: కమిషనరేట్ పరిధిలో ఆన్-సైట్ ఎఫ్‌‌‌‌ఐఆర్ నమోదు విధానం అమలు, అవగాహన , సమర్థవంతమైన నిర్వహణపై సీపీ గౌష్ ఆలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కమిషనరేట్‌‌‌‌లోని అన్ని పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో శనివారం  సమీక్ష   నిర్వహించారు.ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, బాధితులకు సులభంగా న్యాయం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆన్-సైట్ ఎఫ్‌‌‌‌ఐఆర్ విధానం అత్యంత ముఖ్యమైందన్నారు.  

మహిళలు, చిన్నారులు, వృద్ధులు ఇతర బాధితులు పోలీస్ స్టేషన్‌‌‌‌కు రాకుండా వారి నివాసం లేదా సంఘటన స్థలంలోనే ఫిర్యాదు స్వీకరించాలని తెలిపారు. ఎఫ్‌‌‌‌ఐఆర్ నమోదు చేయడం ద్వారా వేగవంతమైన న్యాయం సాధ్యమవుతుందని అన్నారు.ఎఫ్‌‌‌‌ఐఆర్ కాపీని బాధితులకు అందించాలని సూచించారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల విషయంలో వీడియో రికార్డింగ్ తప్పనిసరి అని తెలిపారు. సీసీఆర్బీ ఏసీపీ శ్రీనివాస్ జి, ఇన్‌‌‌‌స్పెక్టర్లు సరిలాల్, రిజర్వు ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.