Reading Time: < 1 minute

IPL 2026: RCB vs CSK మ్యాచ్ ఎవరు గెలుస్తారంటే!

Caption of Image.

IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి మైదానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య హై వోల్టేజ్ పోరు జరగనుంది. ఈ మ్యాచ్ స్టార్ ఆటగాళ్ల మధ్య పోరుగా కూడా మారనుంది. తొలి మ్యాచులో విజయంతో ఆర్‌సీబీ జట్టు మంచి ఊపుమీద కనిపిస్తుండగా.. మరోవైపు చెన్నై జట్టు వరుసగా రెండు ఓటములతో ఒత్తిడిలో ఉంది. గత సీజన్‌లో తొలిసారి చివరి స్థానంలో నిలిచిన చెన్నై, ఈసారి కూడా అదే పరిస్థితిలో ఉండటం గమనార్హం.

పిచ్ రిపోర్ట్: 
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం సాధారణంగా బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడి పిచ్ ప్లాట్ గా ఉండటం వల్ల భారీ స్కోర్లు నమోదు అవుతుంటాయి. ఈ సీజన్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 201 పరుగులు చేసినప్పటికీ, ఆర్‌సీబీ ఆ లక్ష్యాన్ని కేవలం 15 ఓవర్లలోనే ఈజీగా చేధించింది. 

ఏ జట్టు గెలుస్తుందంటే: 
ఇరు జట్లలో  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సమతుల్యంగా కనిపిస్తోంది. హోం గ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా వారికి కలిసి వస్తోంది. చెన్నై జట్టు మాత్రం బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ ఇంకా మెరుగుదల అవసరం ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ జట్టే గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

►ALSO READ | IPL 2026: సన్ రైజర్స్‎కు షమీ షాక్.. 4 ఓవర్లలోనే అభి, హెడ్, కిషాన్ ముగ్గురు ఔట్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:
ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రాజత్ పటిదార్ (కెప్టెన్), రొమారియో షెఫర్డ్, టిమ్ డేవిడ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్ ), కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, సుయాష్ శర్మ
ఇంపాక్ట్ ప్లేయర్: జాకబ్ డఫీ

చెన్నై సూపర్ కింగ్స్:
రుతురాజ్ గైక్వాడ్ ( కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఆయుష్ మాత్రే, కార్తిక్ శర్మ, డేవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, సర్ఫరాజ్ ఖాన్, ఆకీల్ హోసేన్, జేమీ ఓవర్టన్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్
ఇంపాక్ట్ ప్లేయర్: అంషుల్ కాంబోజ్

©️ VIL Media Pvt Ltd.