
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా.. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 162 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య చేధనకు దిగిన ఢిల్లీ జట్టు ఆరంభంలో కాస్త తడబడింది. 7 పరుగుల వద్దే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పాతుమ్ నిస్సాంకాతో కలిసి సమీర్ రిజ్వి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
అయితే 44 పరుగుల వద్ద శాంట్నర్ బౌలింగ్‌లో నిస్సాంకా ఔట్ అయ్యాడు. అయితే సమీర్ మాత్రం ఏ మాత్రం జోరు తగ్గించలేదు. మైదానంలో పరుగుల వరద పారించాడు. 51 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సులతో ముంబై బౌలర్లను కుమ్మేశాడు. 90 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔట్ అయ్యాడు. ఆఖర్లో డేవిడ్ మిల్లర్(21) మ్యాచ్‌ని ఫినిష్ చేశాడు. దీంతో 18.1 ఓవర్లలో ఢిల్లీ 164 పరుగులు చేసి ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.