Reading Time: < 1 minute

IPL 2026G: సన్ రైజర్స్‎కు షాక్.. అర్ధాంతరంగా IPL వదిలి ఆస్ట్రేలియా వెళ్లిన కమిన్స్

Caption of Image.

హైదరాబాద్: కోల్‎కతాపై విజయంతో జోష్‎లో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్‎కు షాక్ తగిలింది. ఎస్ఆర్‎హెచ్ రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఐపీఎల్ టోర్నీ వీడి అర్ధాంతరంగా తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడు. వెన్ను నొప్పి కారణంగా ఈ సీజన్‌లోని తొలి రెండు మ్యాచ్‌లకు కమిన్స్ దూరమైన సంగతి తెలిసిందే. అయితే, గాయం నుంచి కోలుకుని ఐపీఎల్ కోసం ఇండియాకు వచ్చి నెట్స్‎లో ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టాడు. కానీ మైదానంలోకి తిరిగి అడుగుపెట్టడానికి క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అతడికి ఇంకా అనుమతి ఇవ్వలేదు. 

దీంతో తుది అనుమతి కోసం కమిన్స్ మళ్లీ ఆస్ట్రేలియా వెళ్లినట్లు సమాచారం. క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు పర్యవేక్షణలో కమిన్స్‎కు ఒక స్కాన్ జరగనుంది. ఈ స్కాన్‎లో గాయం పూర్తిగా నయమైనట్లు రిపోర్టు వస్తే ఐపీఎల్ ఆడేందుకు అతడికి లైన్ క్లియర్ కానుంది. కమిన్స్ తిరిగి ఏప్రిల్ 17న జట్టులో చేరే అవకాశం ఉంది. దీంతో అతడు ఐపీఎల్ తొలి ఐదు మ్యాచులకు దూరం కానున్నాడు. 

►ALSO READ | Rohit Sharma: ధోనీ రికార్డ్ బ్రేక్ చేసిన హిట్ మ్యాన్.. ఆరెంజ్ క్యాప్ని కైవసం చేసుకున్న రోహిత్

కమిన్స్ అందుబాటులో లేకపోవడంతో ఎస్ఆర్‎హెచ్ తాత్కాలిక కెప్టెన్‎గా ఇండియా యంగ్ బ్యాటర్ ఇషాన్ కిషాన్ ఎంపికైన విషయం తెలిసిందే. ఇషాన్ నేతృత్వంలోని ఎస్ఆర్‎హెచ్ ఈ సీజన్‎ను ఓటమితో మొదలుపెట్టింది. తొలి మ్యాచులో ఆర్సీబీ చేతిలో సన్ రైజర్స్ ఘోర పరాజయం చవిచూసింది. ఈ ఓటమి నుంచి వెంటనే తేరుకున్న ఎస్ఆర్‎హెచ్ రెండో మ్యాచులో కోల్‎కతా నైట్ రైడర్స్‎పై ఘన విజయం సాధించి టోర్నీలో శుభారంభం చేసింది. ఎస్ఆర్‎హెచ్ తమ నెక్ట్స్ మ్యాచులో పంత్ నేతృత్వంలోని లక్నో సూపర్ జైయింట్స్‎తో తలపడనుంది. 

©️ VIL Media Pvt Ltd.