Reading Time: < 1 minute

అమరావతి: కడప జిల్లా వేంపల్లి మండలం వీరన్న గట్టపల్లె వద్ద పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ వైర్లు తాకడంతో పల్లెవెలుగు బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమై 21 మంది ప్రయాణికులు దిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని.. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అందరూ సురక్షితంగా ఉన్నారని వారంతా ఊపిరి పీల్చుకున్నారు.