
విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘రణబాలి’. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. విజయ్, రష్మికల వివాహం తర్వాత ఇద్దరు కలిసి నటిస్తున్న తొలి చిత్రమిది కావడంతో దీనిపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. అయితే రష్మిక ఏప్రిల్ 5న రష్మిక తన పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా రణబాలి టీమ్ ఓ ప్రత్యేక కానుక అందించింది. ఈ సినిమా నుంచి రష్మిక పాత్ర ‘జయమ్మ’ మేకింగ్ వీడియోని విడుదల చేసింది.
జయమ్మ పాత్ర కోసం రష్మిక ఎలా సిద్ధమైందో ఈ వీడియోలో చూపించారు. కాగా, ఈ సినిమాని టి సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. 1854-1878 మధ్య బ్రిటిష్ పాలనలో జరిగిన వాస్తవ చారిత్రక సంఘటనలను ఆధారం చేసుకుని ఈ మూవీ రానుంది. మాతృభూమి కోసం బిట్రిష్ వాళ్లపై తిరుగుబాటు చేసే యోధుడిగా విజయ్ ఈ సినిమాలో కనిపించనున్నాడు.