Reading Time: < 1 minute
Gas Cylinder: షాకింగ్ న్యూస్.. గ్యాస్ ధరలు మళ్లీ పెరుగుతాయా..?

గ్యాస్ కొరత క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ గ్యాస్ ధరలను పెంచింది. గతంలో డొమెస్టిక్, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచగా.. ఏప్రిల్ 1వ తేదీన వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు మరింత పెంచింది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో ఎల్పీజీ ధరలు పెరుగుతున్నాయి. అయితే సరఫరాలో తగ్గుదుల, డిమాండ్ క్రమంలో గ్యాస్ ధరలు మరింత పెరిగే అవకాశముందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో గ్యాస్ ధరల పెరుగుదలపై సీఓటర్ నిర్వహించిన సర్వేలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. ధరలు మరింత పెరుగుతాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

కీలక విషయాలు వెల్లడి

సీ ఓటర్ సర్వేలో 34 శాతం మంది ప్రజలు ధరలు 10 శాతం నుంచి 20 శాతం పెరుగుతాయని భావించారు. మరికొంతమంది ధరలు రెట్టింపు అవుతాయని అభిప్రాయపడ్డారు. సీ ఓటర్ సంస్థ వార్ సర్వే పేరుతో సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రం, జిల్లాలో 18 ఏళ్లుపైబడిన వారి నుంచి అభిప్రాయ సేకరణ నిర్వహించింది. మార్చిలో ఈ సర్వేను నిర్వహించగా.. ఇప్పుడు వివరాలు వెల్లడించారు. ఎంతవరకు ఎల్పీజీ ధరలు పెరగవచ్చనే ప్రశ్నలు సంధించారు. ఈ సర్వేలో మెజార్టీ ప్రజలు భవిష్యత్తులో ధరలు పెరుగుతాయని ఊహిస్తున్నారు. 26 శాతం మంది ప్రజలు 20 నుంచి 50 శాతం వరకు ధరలు పెరగవచ్చని తెలిపారు. ప్రపంచ ఆర్ధిక పరిస్థితులు, ముడి చమురు ధరలు పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని ధరలు గణనీయంగా పెరుగుతాయని చెప్పుకొచ్చారు. ఇక 13 శాతం మంది ప్రజలు గ్యాస్ ధరలు 100 శాతానికిపైగా పెరుగుతాయని భావించారు. ఇక 16 శాతం మంది ఎంత పెరుగుతాయో తాము అంచనా వేయలేమని వెల్లడించారు.