
సంగీత దర్శకుడు రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం ‘గేదెల రాజు’. కాకినాడ తాలూక అనేది క్యాప్షన్. చైతన్య మోటూరి దర్శకత్వంలో వాణి రవికుమార్ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 17న సినిమా విడుదల కానుంది. శనివారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా రఘు కుంచె మాట్లాడుతూ ‘ ప్రతి సినిమాకు పనిచేసిన వారంతా తమ మూవీ బాగుందనే అంటారు. మేము ఎవరెన్ని చెప్పినా థియేటర్స్‌కి ప్రేక్షకుల్ని రప్పించేది కంటెంట్ మాత్రమే. ఇందులో మంచి కంటెంట్ ఉందని మేం నమ్ముతున్నాం.
ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది’ అని చెప్పాడు. డైరెక్టర్ చైతన్య మోటూరి మాట్లాడుతూ ‘‘చూస్తే ఒకటే నిజం.. చూడకపోతే వంద అనుమానాలు’ అనేది మెయిన్ స్టోరీ లైన్. ఒక మర్డర్ మిస్టరీని, క్రైమ్ థ్రిల్లర్‌ను రెండు గంటల ఒక్క నిమిషం నిడివిలో క్రిస్ప్‌గా తెరకెక్కించాం. ఫస్ట్ సీన్ నుంచే కథలోకి వెళ్తారు. ఇందులో హీరోలు, విలన్స్ ఎవరూ ఉండరు. పాత్రలు మాత్రమే ఉంటాయి. వాటి లైఫ్ మాత్రమే ఉంటుంది. ప్రేక్షకుల డబ్బుని కానీ, టైమ్‌ను కానీ వృధా చేయము’ అని చెప్పాడు. తన కొడుకుని దర్శకుడిగా ఆశీర్వదించాలని నిర్మాత వాణి రవికుమార్ కోరారు. నటులు రవిఆనంద్ చిన్నిబిల్లి, శ్రావ్య, మౌనిక, రామచంద్రం, కిష్టయ్య, కో ప్రొడ్యూసర్ తాడాల వీరభద్రరావు పాల్గొన్నారు.