Reading Time: < 1 minute

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో.. రూ. 50 లక్షల గంజాయి సీజ్

Caption of Image.

హైదరాబాద్ సిటీలో మరోసారి భారీగా  గంజాయి పట్టుబడింది. సికింద్రాబాద్ లో రైల్వే స్టేషన్ లో రూ. 50లక్షల విలువైన గంజాయిని సీజ్ చేశారు పోలీసులు. కోణార్క్ ఎక్స్ ప్రెస్ లో గంజాయి రవాణా చేస్తున్న నలుగురు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 72వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. 

సికింద్రాబాద్  రైల్వే స్టేషన్ లో గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర స్మగ్లర్లను శనివారం(మార్చి4) పోలీసులు అరెస్ట్ చేశారు. స్టేషన్ సమీపంలో కొనుగోలుదారుడికోసం ఎదురు చూస్తుండగా అనుమానం వచ్చి ఆరా తీయగా స్మగ్లింగ్ వ్యవహారం బయటపడింది. నిందితులు నాలుగు బ్యాగుల్లో తరలిస్తున్న 42.9 కేజీల గంజాయిని సీజ్ చేశారు. పట్టుకున్న గంజాయి విలువు రూ. 50లక్షలు ఉంటుదని పోలీసులు అంచనా వేశారు.  

►ALSO READ | హైదరాబాద్ నుంచి వెళ్లే చార్మినార్ ఎక్స్‎ప్రెస్ ఆగే చెన్నై స్టేషన్ మారింది..!

గంజాయి స్మగ్లర్లు నలుగురు మహారాష్ట్రకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఏపీనుంచి గంజాయిని సేకరించి ఔరంగా బాద్ కు తరలించేందుకు నిందితులు యత్నించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కిలో గంజాయి సుమారు 4వేలనుంచి 20 వేల వరకు అమ్ముతున్నట్లు గుర్తించారు.  

నిందితులు మహారాష్ట్రకు చెందిన గణేష్ శివనాథ్ బోడుగే (42), పరమేశ్వర్ దామోదర్ బాలప్ (33),విన్నీ శైలేష్ మేశారాం (32),  ఖాన్ సజవార్ నవాజ్ ఖాన్ (54) గా గుర్తించారు. ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ సీఐ చంద్రశేఖర్ గౌడ్ టీం ఆపరేషన్ నిర్వహించి నిందితులును పట్టుకున్నారని వారిని అభినందించారు డీసీపీ అనిల్ కుమార్ రెడ్డి. 

©️ VIL Media Pvt Ltd.