Reading Time: < 1 minute
Allu Arjun Atlee Movie Dubai Schedule Cancelled Amid Middle East War Tensions

పుష్ప 2 తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం బన్నీ, అట్లీ దర్శకత్వంలో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఇటీవలే ఒక కీలక షెడ్యూల్‌ పూర్తి చేశారు. త్వరలోనే విదేశాల్లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. కొన్ని కీలక సన్నివేశాల షూటింగ్‌ని దుబాయ్ అండ్ అబుదాబిల్లో ప్లాన్ చేశాడు అట్లీ. కానీ, ప్రస్తుతం ఇజ్రాయెల్-ఇరాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నడుస్తోంది.

Also Read : RC17 : దేవిశ్రీ లేకుండా సుకుమార్ సినిమా.. రేసులో ఇద్దరు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్

అర‌బ్ కంట్రీస్‌పై క్షిప‌ణుల వ‌ర్షం కురిపిస్తూ భ‌యాన‌క వాతావ‌ర‌ణాన్ని సృష్టిస్తోంది ఇరాన్. దీంతో.. బన్నీ-అట్లీ షూటింగ్‌కు అంత‌రాయం ఏర్ప‌డింద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. వార్ ఎఫెక్ట్ కార‌ణంగా అట్లీ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దుబాయ్, అబుదాబి షెడ్యూల్‌ని క్యాన్సిల్ చేసి.. ఇందుకోసం కొత్త లొకేష‌న్‌ల‌ని ఫైన‌ల్ చేశాడ‌ని సమాచారం. మే నెల నుంచి విదేశాల్లో షూటింగ్ చేయ‌బోతున్నాడ‌ట. మరోవైపు.. ఏప్రిల్ 8న బ‌న్నీ పుట్టిన రోజు సంద‌ర్భంగా గ్లింప్స్ లేదా టీజ‌ర్‌ రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు మేకర్స్. కానీ, వీఎఫ్ ఎక్స్ వర్క్ ఇంకా పూర్తి కాలేద‌ట. దీంతో టైటిల్ అనౌన్స్మెంట్ మాత్రమే ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అభిమానులు ఈ సినిమా టైటిల్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అలాగే.. బర్త్ డే స్పెషల్‌గా రేసు గుర్రం సినిమా రీ రిలీజ్ అవుతుండగా.. ఫుల్ జోష్‌లో ఉన్నారు ఫ్యాన్స్. ఏదేమైనా.. ఐకాన్ స్టార్‌ను అట్లీ ఎలా చూపిస్తాడా? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.