Reading Time: < 1 minute

హామీలన్నీ అమలు చేస్తున్నం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Caption of Image.
  •     తెలంగాణలో గ్యారంటీలపై లెక్కలతో సహా వివరిస్త
  •     కేరళ ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి
  •     సంక్షేమం, మెరుగైన పాలన కోసం యూడీఎఫ్​ను గెలిపించాలని పిలుపు  

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు ఇచ్చిన గ్యారంటీలన్నింటినీ ఈ రెండున్నరేండ్లుగా అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. వీటికి సంబంధించి లెక్కలతో సహా ఆర్థిక శాఖ మంత్రిగా తాను వివరిస్తానని వెల్లడించారు. ఇందులో ఎవరికైనా ఎలాంటి అనుమానం ఉన్నా తమ రాష్ట్రాన్ని సందర్శించి వాటిని నివృత్తి చేసుకోవాలని సూచించారు. శనివారం కేరళ రాష్ట్రంలోని పతనం తిట్టా అసెంబ్లీ నియోజకవర్గంలో యూడీఎఫ్ తరఫున భట్టి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 

తెలంగాణలో విద్యకు ఎక్కువ నిధులు కేటాయించి ఖర్చు చేస్తున్నామని భట్టి చెప్పారు. ఒక్కో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను 25 ఎకరాల్లో రూ.200 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నామని చెప్పారు. ఇందులో విద్య, ఉచిత వసతి ఉంటుందన్నారు. కేరళ అంటే సెక్యులరిజం, ఉన్నత విద్యావంతులు, గొప్ప మానవీయకోణం ఉంటుందని అంతా భావిస్తామని, కానీ ఇప్పుడు అది పక్కకు పోయి గుండాయిజం మాత్రమే కనిపిస్తున్నదని ఆరోపించారు. మార్పు, సంక్షేమం, మెరుగైన పాలన కోసం యూడీఎఫ్ ను గెలిపించాలని భట్టి పిలుపునిచ్చారు.

©️ VIL Media Pvt Ltd.