Reading Time: < 1 minute

రామగుండంలో మంత్రి వివేక్ పర్యటన

Caption of Image.

గోదావరిఖని, వెలుగు : రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి శనివారం రామగుండం ప్రాంతంలో పర్యటించారు. గోదావరిఖని అడ్డగుంటపల్లిలో నివాసముండే ఆల్​ ఇండియా అంబేడ్కర్​ యువజన సంఘం వర్కింగ్​ ప్రెసిడెంట్​ బొంకూరు మధుకు ఇటీవల గుండెకు సంబంధించిన ఆపరేషన్​ జరగగా ఇంటికి వెళ్లి ఆయనను  పరామర్శించారు.  

అలాగే రామగుండంలో కాంగ్రెస్​ లీడర్​ ఎండి జావీద్​ అత్త జమిలా బేగం ఇటీవల ఆనారోగ్యంతో మృతి  చెందగా వారి కుటుంబ సభ్యులను కూడా మంత్రి పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మంత్రి వెంట కాంగ్రెస్​ లీడర్లు గుమ్మడి కుమారస్వామి, రాచకొండ కోటేశ్వర్లు, మల్లేశ్​ యాదవ్, నర్సింగ్​ దొర, గడ్డం మధు, తిప్పారపు మధు, మేకల సమ్మయ్య, తదితరులున్నారు. 

©️ VIL Media Pvt Ltd.