
మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ కారణంగా వరల్డ్ వైడ్ గా ఇంధన సంక్షోభం తలెత్తింది. గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హార్మూజ్ జలసంధిని ఇరాన్ క్లోజ్ చేయడంతో మరిస్థితి దారుణంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారానికి రెండు రోజులు సెలవులు ప్రకటించింది. అయితే ఇది మన దేశంలో కాదండోయ్. పొరుగు దేశమైన నేపాల్ లో. ప్రభుత్వ కార్యాలయాలకు శని, ఆదివారాలను రెండు వారపు సెలవు దినాలుగా ప్రకటిస్తూ నేపాల్ ప్రభుత్వం ఆదివారం రెండు ముఖ్యమైన నిర్ణయాలను ప్రకటించింది. ఈ కొత్త నిర్ణయం ప్రకారం ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటాయి.
Also Read:Green Asha: గుడ్ న్యూస్.. హర్మూజ్ దాటిన మరో భారత ఎల్పీజీ నౌక..
ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు ఇకపై శని, ఆదివారాల్లో మూసివేయబడతాయని ప్రభుత్వ ప్రతినిధి సస్మిత్ పోఖరేల్ తెలిపారు. పెట్రోలియం సరఫరాల విషయంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. ఇప్పటివరకు నేపాల్‌లో శనివారం మాత్రమే వారపు సెలవు దినంగా ఉండేది, కానీ ఈ వారం నుండి శని, ఆదివారాలు రెండూ సెలవు దినాలుగా ఉంటాయి. ప్రభుత్వ కార్యాలయాల పనివేళలను ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పొడిగించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది.
Also Read:US pilot rescue Op: సినిమాకు ఏం తక్కువ కాదు.. ఇరాన్‌లో యూఎస్ పైలట్ రెస్క్యూ ఆపరేషన్ హైలెట్స్..
విద్యా సంస్థలు మినహా ప్రభుత్వ కార్యాలయాలకు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పనివేళలను కొనసాగించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ సమయ పరిమితి విద్యా సంస్థలు మినహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు వర్తిస్తుంది. ఇప్పటి వరకు నేపాల్‌లోని ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పనిచేసేవి, అయితే ఉదయం పూట ఈ సమయాన్ని ఒక గంట పొడిగించారు. ఈ కొత్త విధానం సోమవారం నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుంది. పనితీరుకు ఆటంకం కలగకుండా ఉండేందుకు, ప్రభుత్వ కార్యాలయ ఉద్యోగులు ఇకపై ఒక గంట ముందుగా, అంటే ఉదయం 9 గంటలకే విధులకు హాజరు కావాల్సి ఉంటుంది.