Reading Time: 2 minutes
Dacoit Movie: ‘డెకాయిట్’ ఈవెంట్‌లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా? ఆ స్టార్ హీరో మేన కోడలు.. అలాగే..

హిట్ 2 తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న హీరో అడివి శేష్ ఇప్పుడు డెకాయిట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. షానీల్ డియో తెరకెక్కించిన ఈ లవ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో మృణాళ్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తోన్న ఈ సినిమా ఎట్టకేలకు ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో చిత్ర బృందం ప్రమోషన్లు గట్టిగానే చేస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం (ఏప్రిల్ 04) డెకాయిల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ వేడుకకు అడివి శేష్, మృణాళ్ ఠాకూర్ తో పాటు చిత్ర బృందమంతా హాజరైంది. అయితే ఈ వేడుకలో ఓ బొద్దుగుమ్మ కూడా తళుక్కుమంది. చక్కని చీరకట్టులో అందరి దృష్టిని ఆకర్షించింది. డెకాయిట్ సినిమాలో ఈ బ్యూటీ కూడా ఒక పవర్ ఫుల్ పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోన్న ఈ బొద్దుగుమ్మ మరెవరో కాదు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ హీరో ఆమిర్ ఖాన్ మేనకోడలు జేయన్ మేరీ ఖాన్. ప్రముఖ దర్శకుడు మన్సూర్ ఖాన్ కూతురైన ఆమె ఇప్పటికే హిందీ చిత్ర పరిశ్రమలో నటిగా రాణిస్తోంది. ఇప్పుడు డెకాయిట్ సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించనుంది.

కపూర్ అండ్ సన్స్, సీక్రెట్ సూపర్ స్టార్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసింది జేయన్ మేరీ ఖాన్ . ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన మిస్ సీరియల్ కిల్లర్ సినిమాతో నటిగా పరిచయమైంది. దీని తర్వాత ఫీల్స్ లైక్ ఇష్క్ వెబ్ సిరీస్‌లోనూ తళుక్కుమందీ అందాల తార. వీటితో పాటు ఓ మై డార్లింగ్, మేడ్ ఇన్ హెవెన్, ఇల్లీగల్: జస్టిస్ అవుట్ ఆఫ్ ఆర్డర్ వంటి సినిమాలు, వెబ్ సిరీసుల్లోనూ వివిధ పాత్రలు పోషించింది జేయన్ మేరీ ఖాన్. బాలీవుడ్ లో నటిగా బిజీ బిజీగా ఉంటోన్న ఆమె ఇప్పుడు డెకాయిట్ చిత్రంలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ లో మేరీ ఖాన్ కు సంబంధించిన స్టిల్స్ బాగా హైలెట్ అయ్యాయి.

డెకాయిట్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో జేయన్ మేరీ ఖాన్..

 

View this post on Instagram

 

A post shared by Janya Filmy (@janya.filmy)

అన్నపూర్ణ స్టూడియోస్అండ్ సోనీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న డెకాయిట్ సినిమాలో అనురాగ్ కశ్యప్, ప్రకాశ్ రాజ్ ,సునీల్, అతుల్ కులకర్ణి, కామాక్షి భాస్కర్ల తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by J Caleb’s (@jcreativs)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.