జొన్న పిండి హాల్వాకి కావలసిన పదార్థాలు ఏంటంటే..ఒక కప్పు జొన్న పిండి, రెండు కప్పుల బెల్లం తురుము, అర కప్పు నెయ్యి, రెండు కప్పుల పాలు, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, పది జీడిపప్పులు , ఒక టేబుల్ స్పూన్ బాదంను తీసుకోవాలి.
ముందుగా పిండిని బాగా వేయించుకోవాలి: గ్యాస్ స్టవ్ వెలిగించి దాని మీద పాన్ పెట్టి, 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి అది బాగా వేడయ్యాక, జొన్న పిండిని కూడా వేసి అది గోల్డ్ రంగులోకి మారే వరకు స్టవ్ మీదే ఉంచి బాగా వేయించాలి.
పిండిని ఉడికించుకోవాలి : ఇక ఇప్పుడు వేయించిన పిండిలో రెండు కప్పుల పాలు అలాగే వాటితో పాటు నీళ్లు కూడా పోసి వాటిని ఉండలు లేకుండా బాగా మెత్తగా అయ్యేలా దీనిని కలపాలి. అలాగే పిండిని స్టవ్ మీదే ఉంచి ఉడికించాలి.
జొన్న పిండి బాగా ఉడికిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం తురుమును దీనిలో వేసి బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. ఇక ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా బెల్లం కరిగి హల్వాలాగా మారుతుంది. ఇంకా దీనిలో నెయ్యిని కూడా కలుపుకోవాలి.
ఇక చివర్లో ఒక టేబుల్ స్పూన్ లేదా అర టీ స్పూన్ యాలకుల పొడి, బాదం పప్పులు, జీడిపప్పులు కూడా వీటిని దించేయాలి. మీరు దేనిలో అయితే పెట్టాలనుకుంటున్నారో డానికి నెయ్యి రాసి, చల్లారాక తింటే స్వీట్ స్వీట్ గా బావుంటుంది.




