Reading Time: 2 minutes

IPL 2026: జైస్వాల్, సూర్యవంశీ వైల్డ్ బ్యాటింగ్‌.. 10 ఓవర్లకే రాజస్థాన్ భారీ స్కోర్ 

Caption of Image.

IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ తో జరుగుతున్న కీలక పోరులో రాజస్థాన్ రాయల్స్ జట్టుకి అద్భుతమైన ఆరంభం లభించింది.  మొదట ఓవర్ వేసిన మహ్మద్ సిరాజ్ బౌలింగ్ లో 10 పరుగులు రాబట్టారు. అనంతరం 3 ఓవర్ వేసిన సిరాజ్ బౌలింగ్ లో జైస్వాల్ కి లైఫ్ లభించింది.. దీంతో అతడు ప్రస్తుతం చెలరేగిపోతున్నాడు. మరోవైపు 15 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ వైల్డ్ ఫైర్ బ్యాటింగ్ తో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.

ఇక ఐదో ఓవర్ వేసిన అశోక్ శర్మ బౌలింగ్ లో వైభన్ కి లైఫ్ లభించింది. కష్టమైన క్యాచ్ ని గుజరాత్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ వదిలి పెట్టడంతో ఆ బాల్ ఫోర్ వెళ్లిపోయింది. ఇక బంతిని ఆపే క్రమంలో సిరాజ్ గాయపడటంతో మైదానం వీడాడు. ఆ తర్వాత బంతినే సూర్యవంశీ సిక్స్ గా మలచడంతో కేవలం 5.1 ఓవర్లలోనే 50 పరుగుల మార్క్ ని ఆర్ఆర్ జట్టు అందుకుంది. భారీగా పరుగులు వెళ్తున్న క్రమంలో రంగంలోకి దిగిన తాత్కాలిక కెప్టెన్ రషీద్ ఖాన్.. తన బౌలింగ్ లో వైభవ్ సూర్యవంశీని బోల్తా కొట్టించాడు. 

►ALSO READ | IPL 2026: రాజస్థాన్‎తో మ్యాచుకు గిల్ దూరం.. గుజరాత్ కెప్టెన్‎కు ఏమైందంటే..?

70 పరుగుల వద్ద రషీద్ బౌలింగ్(6.2) లో గ్లాన్ ఫిలిప్స్ కి క్యాచ్ ఇచ్చి వైభవ్ సూర్యవంశీ (18 బంతుల్లో 5 ఫోర్లు ఒక సిక్సుతో 31 పరుగులు) ఔట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ధ్రువ్ జురెల్– యశస్వి జైస్వాల్ నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తూ.. రాజస్థాన్ జట్టు స్కోర్ బోర్డుని ముందుకు నడిపిస్తున్నారు. వైభన్ అవుట్ అయిన తర్వాత యశస్వి తనదైన స్టైల్ లో దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ.. హాఫ్ సెంచరీని కంప్లీట్ చేసుకున్నాడు. దీంతో 10 ఓవర్లు ముగిసే సమయానికి రాజస్థాన్ రాయల్స్ జట్టు ఒక వికెట్ నష్టానికి 107  పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ ఒక్కడే ఒక వికెట్ పడగొట్టాడు. ప్రస్తుతం క్రీజులో ధ్రువ్ జురెల్, జైస్వాల్ ఉన్నారు. 

©️ VIL Media Pvt Ltd.