Reading Time: < 1 minute

హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావు లేఖ రాశారు. భద్రాచలం పక్కనున్న 5 గ్రామాలను తెలంగాణలో కలపాలని అందులో కోరారు. పాలనా సౌలభ్యం కోసం వీటిని భద్రాచలంలో కలపాలన్నారు. ఐదు గ్రామాలను కలిపితేనే గిరిజనుల సమస్యలు తొలగుతాయని పేర్కొన్నారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే విలీనం బిల్లును ప్రవేశపెట్టేలా చూడాలని కోరారు.