
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ఈ ఏడాది సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రంతో అదిరిపోయే సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు తన రూట్ మార్చి ‘బైకర్’ వంటి సరికొత్త ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు.
మోటో రేసింగ్ స్పోర్ట్స్ డ్రామాతో వచ్చిన ఈ ‘బైకర్’ థియేటర్లో దుమ్మురేపుతోంది. శుక్రవారం (ఏప్రిల్ 3న) భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ శర్వా కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ దిశగా దూసుకెళ్తున్నాడు. శర్వా మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్న మాదిరిగానే ఇదొక ఇండియా గర్వించే సినిమాలా తీర్చిద్దిదారు మేకర్స్. ముఖ్యంగా తెలుగు సినిమా గర్వంగా చెప్పుకునే చిత్రంగా రేసింగ్ విజువల్స్ ఉండటమే ‘బైకర్’ ప్రత్యేకత. ఈ క్రమంలోనే ఆడియన్స్ థియేటర్లలో తమ జోష్ని వ్యక్తపరుస్తున్నారు.
సినిమా సక్సెస్ నేపథ్యంలో శర్వానంద్ భావోద్వేగానికి గురయ్యారు. హైదరాబాద్‌లోని శ్రీరాములు థియేటర్‌లో బిగ్ స్క్రీన్‌కు సాష్టాంగ నమస్కారం చేసి, తెరను ముద్దు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కంటతడి పెట్టడం గమనార్హం. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది శర్వాకు సినిమాపై ఉన్న ప్రేమ, గౌరవానికి నిదర్శనం అని అభిమానులు భావిస్తున్నారు.
The love and respect he has for cinema ❤️
బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన #Biker తరువాత హౌస్‌ఫుల్ శ్రీరాములు థియేటర్లో పెద్ద తెరకు నమస్కరించిన Charming Star @ImSharwanand pic.twitter.com/TmIzSJzWd1
— Milagro Movies (@MilagroMovies) April 5, 2026
లూజర్’ వెబ్ సిరీస్‌తో మంచి గుర్తింపు పొందిన డైరెక్టర్ అభిలాష్ రెడ్డి ఈ సినిమాని స్టైలిష్ రేసింగ్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. హై-ఆక్టేన్ రేసింగ్ సీక్వెన్స్‌లు హాలీవుడ్ ప్రమాణాలకు తగ్గట్టుగా ఉన్నాయి. వేగం, భావోద్వేగాలు, గెలుపు కోసం చేసే పోరాటం సినీ ఆడియన్స్ ను వీపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇందులో శర్వానంద్ ఒక ఉత్సాహవంతుడైన రేసర్‌గా కనిపంచి ఆకట్టుకున్నారు. రాజశేఖర్ ఆయనకు దిశానిర్దేశం చేసే తండ్రిగా, మెంటర్‌గా కనిపించారు.
‘బైకర్’ కథ:
హీరో విక్కీ (శర్వానంద్) ఒక టాప్ మోటోక్రాస్ రేసర్. తండ్రి సునీల్ (రాజశేఖర్) ట్రైనింగ్‌తో నెంబర్‌వన్ ఛాంపియన్‌గా ఎదుగుతాడు. ఎలాగైనా విక్కీని అంతర్జాతీయ స్థాయిలో కూడా ఛాంపియన్‌గా నిలబెట్టాలని తండ్రి సునీల్ కలలు కంటాడు.
►ALSO READ | Vijay Rashmika: “ఐ లవ్ యూ జయమ్మ”.. రష్మికకు విజయ్ స్పెషల్ విషెస్.. క్రేజీ వీడియో పోస్ట్
ఈ లక్ష్యంతో ఐఎన్‌జీ అనే స్పాన్సరింగ్ కంపెనీ అధినేత (అతుల్ కులకర్ణి)తో ఒప్పందం కుదుర్చుకుంటాడు. అయితే, అంతర్జాతీయ స్థాయికి అడుగుపెట్టే కీలక సమయంలోనే విక్కీ అనూహ్యంగా రేసింగ్‌ను వదిలేస్తాడు.
ఇంతకీ విక్కీ రేసింగ్‌ను ఎందుకు వదిలేశాడు? అతని సడెన్ డెసిషన్కి కారణం ఏమిటి? విక్కీ లైఫ్ లోకి అనన్య (మాళవిక నాయర్) వచ్చాక ఏం జరిగింది? చివరికి విక్కీ తిరిగి రేసింగ్‌లోకి వచ్చాడా? తండ్రి కల నెరవేరిందా? అన్న ప్రశ్నలకు సమాధానమే ‘బైకర్’ కథ.