
- కూకట్పల్లిలో జీరో ఎఫ్ఐఆర్
కూకట్పల్లి, వెలుగు: మతాంతర వివాహం చేసుకున్న భార్యపై తన స్నేహితులతో కలిసి భర్త గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డాడు. ఓ యువతి కూకట్పల్లిలో తన తల్లితో కలిసి నివసిస్తున్నది. వారికి తమ ఇంటి వద్దనే ఒక షాపు ఉంది. సంవత్సరం క్రితం నవాజ్ అనే యువకుడు ఈ షాప్ అద్దెకు కావాలని వచ్చాడు. షాపు అద్దెకు తీసుకున్న ఇతను క్రమంగా ఆ యువతితో ప్రేమలో పడ్డాడు.
తాను హిందూ మతంలోకి మారానని యువతిని నమ్మించిన అతను… ఆమెను గతేడాది జులైలో పెండ్లి చేసుకున్నాడు. తర్వాత భార్యతో కలిసి పంజాగుట్టకు మకాం మార్చాడు. తాను మతం మారలేదని చెప్పి భార్యను మతం మార్పించి పేరు మార్చాడు. ఒక రోజు పార్టీ పేరుతో తన స్నేహితులు మునావర్, షారుఖ్, ఇస్మాయిల్, ఇర్ఫాన్, సమీర్‌ను ఇంటికి తీసుకువచ్చాడు.
కూల్ డ్రింక్స్‌లో మత్తుమందు కలిపి భార్యకు ఇచ్చాడు. తర్వాత అందరూ కలిసి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. పెండ్లి చేసుకున్న తర్వాత నవాజ్.. తన తల్లి నుంచి రూ.16 లక్షలు నగదు తీసుకున్నాడని, తర్వాత ఒక ప్లాట్ కూడా రాయించుకున్నాడని బాధితురాలు ఆరోపించింది. నవాజ్ హవాలా వ్యాపారం చేస్తుంటాడని పోలీసులకు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు జీరో ఎఫ్ఐఆర్ చేసిన కూకట్పల్లి పోలీసులు.. కేసును పంజాగుట్ట పోలీసుస్టేషన్‌కు బదిలీ చేశారు.