
ప్రధాని మోడీ పూర్తిగా డొనాల్డ్ ట్రంప్ నియంత్రణలో ఉన్నారని ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ విమర్శించారు. కేరళలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహిచారు. ఈ సందర్భంగా మోడీ సర్కార్‌పై ధ్వజమెత్తారు. అత్యంత అవమానకరమైన విషయం ఏమిటంటే.. మోడీ.. డొనాల్డ్ ట్రంప్‌ను ‘సర్’ అని పిలవడం అన్నారు. మోడీ ఇంకా బ్రిటిష్ కాలంలో ఉన్నానని అనుకుంటున్నారని ఎద్దేశా చేశారు. ప్రధాని మోడీ.. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను ఎలా నియంత్రిస్తున్నారో.. డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రధాని మోడీని అలాగే నియంత్రిస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఇక ఎన్నికల తర్వాత వామపక్షాలు మనుగడ సాగించలేవని.. ఎల్‌డిఎఫ్‌పై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికారం కోసం బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌లతో కుమ్మక్కైనందున.. కేరళలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డిఎఫ్) తన వామపక్ష భావజాలాన్ని కోల్పోయిందన్నారు. ఎన్నికల తర్వాత అందులో ఏమీ మిగలదని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Annamalai: ఆ ప్రచారమంతా అబద్ధం.. బీజేపీ జాబితాలో పేరు లేకపోవడంపై అన్నామలై క్లారిటీ
సూత్రాల విషయంలో రాజీ పడుతున్నందుకు ఎల్‌డీఎఫ్‌ను రాహుల్ గాంధీ విమర్శించారు. ఎల్‌డీఎఫ్ చాలా సంవత్సరాలుగా మన ప్రత్యర్థి అని.. మనం వారితో పోరాడినట్లు గుర్తుచేశారు. ఇకపైనా కూడా పోరాడుతూనే ఉంటామన్నారు. కానీ చాలా సంవత్సరాలుగా వారు మనం అంగీకరించని కొన్ని ఆలోచనల కోసం నిలబడ్డారని.. ఆ ఆలోచనల ఆధారంగానే వారిని వ్యతిరేకించినట్లు తెలిపారు. కేరళలోని మతతత్వ ప్రభుత్వాన్ని ఒక చీకటి శక్తి ప్రభావితం చేస్తోందని.. అది రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ప్రజలపై దాడి చేస్తోందని పేర్కొన్నారు.
#WATCH | Idukki, Keralam | Lok Sabha LoP and Congress leader Rahul Gandhi says, “Narendra Modi is fully controlled by Donald Trump… The most humiliating part is that Narendra Modi calls Donald Trump ‘Sir’. He thinks he is back in the British times… Donald Trump controls PM… pic.twitter.com/86NlgJNNe9
— ANI (@ANI) April 4, 2026
#WATCH | Idukki, Keralam | Lok Sabha LoP and Congress leader Rahul Gandhi says, “I was listening to the young lady who sang ‘Vande Mataram’… She represents the women of Keralam… Don’t think what you heard did not take hard work… And that is why we want to ensure that every… pic.twitter.com/AxinzXzcSt
— ANI (@ANI) April 4, 2026